ఆ సినిమా చూసి మా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేశాం: మహేష్ బాబు

ఆ సినిమా చూసి మా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేశాం: మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఒక స్పెషాలిటీ ఉంది. ఏదైనా సినిమా నచ్చితే చాలు.. అది చిన్నదైనా.. పెద్దదైనా చక్కగా ప్రశంసలు కురిపించేస్తారు. అర్జున్ రెడ్డి సినిమా చాలా వివాదాస్పదమైంది. ఆ సమయంలో కూడా మహేష్ ఆ సినిమాపై ప్రశంసలు కురిపించాడు. ఇక తాజాగా జవాన్ మూవీ చూసి మెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే అనుష్క, నవీన్ పొలిశెట్టి నటించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ తాజాగా విడుదలైన విషయం తెలిసిందే.

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీని చూసిన మహేష్.. ఈ చిత్రంపై కూడా ప్రశంసలు కురిపించాడు. ఈ సినిమా చూసి మహేష్ బీభత్సంగా ఎంజాయ్ చేశాడట. సినిమాలో కామెడీ పీక్స్‌లో ఉందని.. తమ ఫ్యామిలీ అంతా ఈ సినిమా చూసి ఎంజాయ్ చేశామని మహేష్ తెలిపాడు. అలాగే నవీన్ ఈ సినిమాకి మెయిన్ అట్రాక్షన్ అని.. అనుష్క ఎప్పటిలానే ఆదరగొట్టింది దర్శకుడు మహేష్ తన రివ్యూలో తెలిపాడు.

శెట్టి జంట ఇరగదీశారట.. బొమ్మ బ్లాక్ బస్టరేనట..

యూవీ క్రియేషన్స్ వారు మంచి సినిమా అందించారని మహేష్ ప్రశంసలు కురిపించాడు. మహేష్ ఇచ్చిన రివ్యూ చూసి చిత్ర హీరోహీరోయిన్లతో పాటు యూనిట్ మొత్తం ఫుల్ ఖుషీ అవుతోంది. ఇక మహేష్ ప్రస్తుతం గుంటూరు కారం సినిమా షూటింగ్‌ని శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి.

ఇవీ చదవండి:

కేవలం ఆ కారణంగానే కిరణ్ రాథోడ్ ఎలిమినేట్

అక్కడ అడుగు పెట్టగానే కళ్లలో నీళ్లు తిరిగాయి: అనుష్క

బిగ్‌బాస్ తెలుగు 7.. బిగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్న నిర్వాహకులు

నా ఆరోగ్యం అస్సలు బాగోలేదు.. క్రిటికల్ కండీషన్‌లో ఉన్నా: గాయత్రి గుప్తా

నా కొడుకును బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నాడు: విజయ్ దేవరకొండ తండ్రి సంచలనం

జైలు సెంటిమెంటు పెట్టు.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టు..

Google News