Pawan Kalyan Shoe: పవన్ షూ ఖరీదు.. జిన్నా మూవీ ఓవర్సీస్ కలెక్షన్లను మించి పోయిందట..

Pawan Kalyan Shoe: పవన్ షూ ఖరీదు.. జిన్నా మూవీ ఓవర్సీస్ కలెక్షన్లను మించి పోయిందట..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లో ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతున్న చిత్రం ‘బ్రో ది అవతార్’. ఈ సినిమాను భీమ్లా నాయక్ తర్వాత దాదాపు ఏడాది కాలం పాటు గ్యాప్ తీసుకుని చేశారు. ఈ సినిమాలో వపన్‌తో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా నటించారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తైంది. ఈ మల్టీ స్టార్ మూవీలో ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ నటిస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్‌కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదలయ్యాయి. వీటికి ఫ్యాన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

Pawan Kalyan Shoe: పవన్ షూ ఖరీదు.. జిన్నా మూవీ ఓవర్సీస్ కలెక్షన్లను మించి పోయిందట

నేడు పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి ఉన్న పోస్టర్లను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇక నేడు విడుదలైన పోస్టర్‌లో యి ధరమ్ తేజ్ చేతులు కట్టుకొని పవన్ కళ్యాణ్ వెనుక నిలబడగా,పవన్ కళ్యాణ్ స్టైల్ గా బైక్ మీద కాలు పెట్టుకుంటాడు. చూడగానే వావ్ అనిపించే ఈ పోస్టర్ పవన్ అభిమానులను మరింత ఆకట్టుకుంది.

ఇక జనాల కళ్లు ముందుగా పోస్టర్‌లోని పవన్ బూట్లపై పడింది. అవి తెలుపు, నలుపు రంగు బూట్లతో చాలా ఆకర్షణగా ఉన్నాయి. అవి చూసి ఫ్యాన్స్ ఆగుతారా? రేటు ఎంతో కనుక్కునేందుకు గూగుల్‌ను అడిగారు. ధర చూసి ఫ్యాన్స్‌ షాక్ అయ్యారు. ఈ బూట్ల ధర రూ.లక్ష పైమాటేనని.. మంచు విష్ణు హీరోగా నటించిన ‘జిన్నా’ మూవీ ఓవర్సీస్ కలెక్షన్స్ కంటే ఎక్కువ అంటూ పోస్టులు పెడుతున్నారు.

Google News