Keerthy Suresh: తన కూతురు ప్రేమ, పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేష్ తండ్రి

Keerthy Suresh: తన కూతురు ప్రేమ, పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేష్ తండ్రి

హీరోయిన్‌ కీర్తి సురేష్‌(Keerthy Suresh) ప్రేమలో పడిందంటూ ఇటీవలి కాలంలో న్యూస్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఈ ముద్దుగుమ్మ ఫర్హాన్ అనే వ్యక్తితో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అప్పటి నుంచి అమ్మడు ప్రేమలో ఉందని.. త్వరలోనే ఫర్హాన్‌ను పెళ్లి కూడా చేసుకోబోతోందంటూ వార్తలొచ్చాయి. కీర్తి(Keerthy Suresh) షేర్ చేసిన ఫోటోల్లో ఇద్దరూ ఒకే రకం దుస్తులు ధరించి ఉండటం కూడా ఈ రూమర్స్‌కు కారణమైంది.

అయితే తాజాగా ఈ వార్తలపై కీర్తి తండ్రి సురేష్ స్పందించారు. అవన్నీ వట్టి పుకార్లేనని తేల్చి పారేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కేరళ బీజీపీ నాయకురాలు శోభ సురేంద్రన్‌ ఖాతాలో ఓ వీడియోను విడుదల చేశారు.

Keerthy Suresh: తన కూతురు ప్రేమ, పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేష్ తండ్రి

ఆ వీడియోలో సురేష్ మాట్లాడుతూ.. తన కూతురు కీర్తి ఫర్హాన్ అనే అబ్బాయితో లవ్‌లో ఉందని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందంటూ మీడియాలో వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజమూ లేదని తేల్చి చెప్పారు. అవన్నీ ఫేక్ న్యూస్ అని ఫర్హాన్ తండ్రి కొట్టిపడేశారు. ఫర్హాన్ తమ ఫ్యామిలీ ఫ్రెండ్ అని.. అతని పుట్టినరోజు సందర్భంగా కీర్తి(Keerthy Suresh) ఈ పిక్స్‌ను షేర్ చేసిందన్నారు. వాటిని చూసి మీడియా తప్పుడు రాతలు రాసిందన్నారు.

ఒకవేళ కీర్తి పెళ్లి కుదిరితే ముందుగా మీడియాకు, ప్రజలకు చెబుతామని సురేష్ తెలిపారు. ఇలాంటి తప్పుడు వార్తలను ఇక మీదట ప్రచారం చేయవద్దని.. వాటి కారణంగా తమ కుటుంబంలో మన:శ్శాంతి కరువైందని సురేష్ వెల్లడించారు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!