Tollywood Stars: బాలీవుడ్ హీరోలను మించి రెమ్యూనరేషన్ తీసుకుంటున్న టాలీవుడ్ స్టార్స్..

Tollywood Stars: బాలీవుడ్ హీరోలను మించి రెమ్యూనరేషన్ తీసుకుంటున్న టాలీవుడ్ స్టార్స్..

దేశంలో అత్యధిక టర్నోవర్ కలిగిన బిజినెస్ సినీ ఇండస్ట్రీలోనే జరుగుతుందనడంలో సందేహం లేదు. కోట్ల కొద్దీ ఇన్వెస్ట్ మెంట్ చేసి అంతకుమించి లాభాలు పొందుతారు. ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో తారల రెమ్యూనరేషన్ కూడా ఉంటుంది. ఇక హీరోల్లో ఒక్కొక్కరికీ ఒక్కో రేటు ఉంటుంది. ఇక ఇప్పుడు పాన్ ఇండియా హవా నడుస్తోంది కాబట్టి హీరోల బడ్జెట్ మరింత పెరిగింది.

ఇండియా లెవల్లో హైయ్యస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోల్లో తెలుగు వారు లేకపోలేదు. వారెవరో చూద్దాం. ప్రభాస్ అయితే ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు తీసుకుంటాడని సమాచారం. అలాగే సినిమా హిట్ అయితే వచ్చే లాభాల్లో వాటా.

Tollywood Stars: బాలీవుడ్ హీరోలను మించి రెమ్యూనరేషన్ తీసుకుంటున్న టాలీవుడ్ స్టార్స్..

ఆర్ఆర్ఆర్ తర్వాత టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్ అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోల జాబితాలోకి ఎక్కాడు. ఒక్కో సినిమాకు రూ.100 కోట్లు వసూలు చేస్తున్నారని టాక్. ఇక ఇళయ దళపతిగా పేరు తెచ్చుకున్న హీరో విజయ్.. ఒక్కో సినిమాకు రూ.80 కోట్లు వసూలు చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ రూ.80 కోట్లు వసూలు చేస్తున్నారట.

కండల వీరుడు సల్మాన్, సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం రూ.80 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒక్కో సినిమాకు రూ.60 కోట్లు తీసుకుంటున్నారని టాక్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రూ.55 కోట్లు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రూ.30 కోట్లు తీసుకుంటున్నారట.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!