సింగర్ సునీత రెండో పెళ్లిపై ఆమె కొడుకు ఆసక్తికర కామెంట్స్

సింగర్ సునీత రెండో పెళ్లిపై ఆమె కొడుకు ఆసక్తికర కామెంట్స్

సింగర్ సునీత రెండో వివాహం చేసుకుంటారని ఎవరూ ఊహించలేదు. మొదటి భర్తతో విడిపోయిన ఆమె చాలా కాలంగా తన పిల్లలను, తల్లిదండ్రులను చూసుకుంటూ గడిపేస్తున్నారు. అదీకాకుండా ఆమె 42 ఏళ్ల వయసులో రెండో పెళ్లి గురించి ఆలోచిస్తారని ఎవరూ ఊహించలేదు. అయితే లాక్‌డౌన్ సమయమే రామ్, సునీతలను కలిపిందట. ఆ సమయంలో తరచూ వీరిద్దరూ మాట్లాడుకునేవారట.

అలా మాటలు కాస్తా ప్రేమగా మారి ముందు రామ్ పెళ్లి ప్రపోజల్ సునీత ముందు ఉంచారట. ఇంట్లో వారితో మాట్లాడి నిర్ణయం చెబుతానన్నారట సునీత. ఇంట్లో వారు కూడా వీరిద్దరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆనందంగా సునీత పెళ్లి రామ్‌తో జరిగిపోయింది. అయితే వీరి పెళ్లి గురించి సునీత పిల్లలు ఇప్పటి వరకూ ఎక్కడా పెదవి విప్పింది లేదు. తాజాగా సునీత కుమారుడు తల్లి పెళ్లిపై స్పందించాడు.

సింగర్ సునీత రెండో పెళ్లిపై ఆమె కొడుకు ఆసక్తికర కామెంట్స్

రెండో పెళ్లి విషయంలో తన తల్లి చాలా భయపడిందని.. తామెలా అర్థం చేసుకుంటామోనని ఆందోళనకు గురైందని సునీత కొడుకు ఆకాష్ తెలిపాడు. రామ్‌పై నమ్మకం ఉందా? అని అడగ్గా.. ఉందని తన తల్లి చెప్పిందట. చాలా కాలంగా ఎమోషనల్ సపోర్ట్ మిస్ అవుతున్న ఆమె సంతోషమే తమకు ముఖ్యమని పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చామని ఆకాష్ తెలిపాడు. అయితే సునీత రెండో పెళ్లి తర్వాత కూడా తన తండ్రి ఇంటికి వస్తుంటారని.. ఆయనతో రామ్ ఫ్రెండ్లీగా ఉంటారని తెలిపాడు. కోపం వంటివన్నీ వదిలేసి హాయిగా జీవనం సాగిస్తున్నట్టు ఆకాష్ తెలిపాడు.

Google News