యాంకర్‌ను వివాహమాడిన ‘శ్రీకారం’ దర్శకుడు

యాంకర్‌ను వివాహమాడిన ‘శ్రీకారం’ దర్శకుడు

‘శ్రీకారం’ సినిమా దర్శకుడు కిశోర్‌ రెడ్డి వివాహం చేసుకున్నారు. ఆయన వివాహం చేసుకున్నది మరెవరినో కాదు.. కేసీగా పేరుగాంచిన  తెలుగు యాంకర్ కృష్ణ చైతన్యను. నేటి తెల్లవారుజామున మూడు గంటలకు కిశోర్ – కృష్ణ చైతన్యల వివాహం హైదరాబాద్ మామిడిపల్లి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా జరిగింది.  శర్వానంద్ హీరోగా ‘శ్రీకారం’ సినిమాను కిశోర్ తెరకెక్కించారు.

వ్యవసాయం నేపథ్యంలో రూపొందిన శ్రీకారం సినిమా మంచి హిట్ కొట్టింది. ఆ తరువాత మరో రెండు సినిమాలు టాలీవుడ్‌లో చేసినప్పటికీ అవి పెద్దగా జనాలకు అయితే తెలియలేదు. ఇక కిశోర్ రెడ్డి ఓ కన్నడ సినిమాకుసైతం అసిస్టెంట్‌గా పని చేశారు. యాంకర్ కేసీగా కృష్ణ చైతన్య బాగా ఫేమస్ అయిపోయింది. గతంలో ఆమె ఆర్జేగా కూడా పని చేసింది. ఆర్జే స్మైలీ క్వీన్ పేరుతో ఆమె రేడియో జాకీగా ఫేమస్ అయ్యింది.

Advertisement

అనంతరం యూట్యూబ్ ద్వారా జనాలకు మరింత దగ్గరైంది. పలు ఇంటర్వ్యూలు నిర్వహించడమే కాకుండా సినిమా కార్యక్రమాలకు సైతం యాంకర్‌గా వ్యవహరిస్తూ ఉంటుంది. ఇక కిశోర్ –  కృష్ణ చైతన్యల వివాహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై ఆశీర్వదించారు. అయితే వీరిద్దరి వివాహానికి సంబంధించిన ఫోటోలు అయితే బయటకు రాలేదు కానీ రిసెప్షన్ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.