టబ్‌లో ఐస్ ముక్కల నడుమ కూర్చొని హీరోయిన్ మెడిటేషన్..

టబ్‌లో ఐస్ ముక్కల నడుమ కూర్చొని హీరోయిన్ మెడిటేషన్..

నటీనటులకు ఫిట్‌నెస్ చాలా ముఖ్యం. దీనికోసం నటీనటులంతా ఎంతగానో శ్రమిస్తుంటారు. ఫుడ్ కంట్రోల్‌లో పెడతారు. అవసరమైన ఆసనాలు, జిమ్ అంటూ నానా తంటాలు పడుతుంటారు. దీనిలో భాగంగానే నటి సునైనా కొత్త యోగాను ప్రాక్టీస్ చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోడలింగ్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది సునైనా.

అచ్చ తెలుగు అమ్మాయి అయిన సునైనా తమిళంలో కాదలిల్‌ విళిందేన్‌ చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. నటుడు నకుల్‌కు జంటగా నటించి తొలి సినిమాతోనే సక్సెస్ సాధించింది. ఆ తరువాత మరో సినిమాలోనూ ఈ హీరోతో కలిసి నటించింది. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందంటూ పెద్ద ఎత్తున టాక్ నడిచింది. ఆ తరువాత వీరిద్దరూ కలిసి నటించింది లేదు.

Advertisement
టబ్‌లో ఐస్ ముక్కల నడుమ కూర్చొని హీరోయిన్ మెడిటేషన్..

ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ స్టార్‌డమ్ అయితే సంపాదించుకోలేకపోయింది. ఇక ఇప్పుడు సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లోనూ నటిస్తోంది. ఈ క్రమంలోనే అమ్మడు తాజాగా ఓ యోగాసనం ప్రాక్టీస్ చేస్తోంది. అదేంటంటే.. ఐస్ మెడిటేషన్. దీని వల్ల నరాలు బలపడటంతో పాటు శరీర బడలిక తగ్గుతుందట. ఒక టబ్‌లో ఐస్ ముక్కల నడుమ ఆమె కూర్చొని మెడిటేషన్ చేస్తోంది. దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.