వామ్మో రతిక.. బీభత్సంగా ట్రోల్స్

వామ్మో రతిక.. బీభత్సంగా ట్రోల్స్

బిగ్‌బాస్ సీజన్ 7 ఆసక్తికరంగా సాగుతోంది. ఇక ఈ షో నాలుగో వారంలోకి అడుగు పెట్టింది. ఇప్పటి వరకూ ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఇక ఆదివారం షో హౌస్‌లో కాక రేపుతోంది. నిజానికి ఏడు సీజన్లను పరిశీలిస్తే దారుణంగా వెన్నుపోట్లు పొడుస్తున్న వ్యక్తి సీజన్ 7లో మాత్రమే కనిపిస్తోందనడంలో సందేహం లేదు. ఆ వ్యక్తి మరెవరో కాదు రతిక.

షో చూస్తున్న వారందరికీ ఈ విషయం క్లియర్‌గానే అర్థమవుతుంది. నిన్న నాగార్జున ముందు ‘వాళ్లద్దరి చేతులు కలిస్తేనే చప్పట్లు’ అంటూ చాలా సరదాగా రతిక-పల్లవి ప్రశాంత్ బంధంపై శివాజీ కామెంట్ చేశారు. దీనికి రతిక తెగ ఫీలయిపోయింది. తన ఇంట్లో వాళ్లు చూస్తారని.. నేషనల్ ఫ్లాట్ ఫాంలో తనపై చేయకూడని కామెంట్స్ శివాజీ చేశారంటూ నానా యాగీ చేసింది.

వామ్మో రతిక.. బీభత్సంగా ట్రోల్స్

కనీసం శివాజీ దగ్గరకు వెళ్లి క్లారిటీ తీసుకోకముందే ఇతర కంటెస్టెంట్స్ దగ్గర ఆయన గురించి బ్యాక్ బిచ్చింగ్ స్టార్ట్ చేసింది. అసలు నిజంగానే శివాజీ అన్నట్టు ఆమె వీడియోలు తీసి ప్లే చేస్తే.. ఏం చేస్తుంది? తల ఎక్కడ పెట్టుకుంటుంది. అటు యావర్.. ఇటు పల్లవి ప్రశాంత్ ఇద్దరినీ రాంగ్ ట్రాక్ పట్టించింది రతిక. ఆపై తనపైనే వారిద్దరికీ క్రష్ ఉన్నట్టుగా ప్రచారం మొదలు పెట్టేసింది. ఇప్పటికే ఆమెపై బీభత్సంగా ట్రోల్స్ వస్తున్నాయి. కనీసం శివాజీ సారీ చెప్పినా కూడా తానేదో శుద్ద పూస మాదిరిగా కలరింగ్ ఇచ్చేసి నానా యాగీ చేయడం ఏంటని విమర్శకులు అంటున్నారు.

https://twitter.com/MassMayanti/status/1706351596614062488
Google News