కేజీఎఫ్‌ తర్వాత యశ్ మరో సినిమా చేయకపోవడానికి కారణమేంటంటే..

కేజీఎఫ్‌ తర్వాత యశ్ మరో సినిమా చేయకపోవడానికి కారణమేంటంటే..

కన్నడ స్టార్ హీరో యశ్.. కేజీఎఫ్ సిరీస్ వంటి బ్లాక్ బస్టర్ మూవీ చేసిన తర్వాత పెద్ద గ్యాపే తీసుకున్నాడు. ఒక్కసారిగా కేజీఎఫ్‌తో పాన్ ఇండియా రేంజ్‌కి ఎదిగిన తర్వాత అలా గ్యాప్ తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కారణమేంటా? అని ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. కేజీఎఫ్ చేసిన తర్వాత యశ్‌పై భారం మరింత పెరిగింది. దీంతో ఆ సినిమా రేంజ్‌కి తగ్గకుండా చూసుకోవాలి.

ఇప్పుడు ఏ డైరెక్టర్‌తో సినిమా చేయాలా? అనే డైలమాలో యశ్ ఉన్నట్టు సమాచారం. నిజానికి పాన్ ఇండియా సినిమాలు తీసే సత్తా కన్నడలో కేవలం ఒకరిద్దరు డైరెక్టర్లకు మాత్రమే ఉందని టాక్. ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేసిన యశ్.. తిరిగి లోకల్ డైరెక్టర్లతో చేయలేక కాస్త సంశయంలో ఉన్నాడట. అందుకే నెక్ట్స్ సినిమా చేయడానికి తీవ్రంగా ఆలోచిస్తున్నాడట.

అయితే పూరి జగన్నాథ్‌తో సినిమా చేసేందుకు యశ్ సిద్ధమవుతున్నట్టు టాక్. తెలుగు డైరెక్టర్స్‌లో మంచి హిట్ ఇచ్చే సత్తా ఉన్న వారిలో పూరి ఒకరు. మంచి మాస్ మసాలా ఎంటర్‌టైర్‌లకు ఆయన పెట్టింది పేరు. ఈ మధ్య ఎందుకో వెనుకబడిపోయారు కానీ అప్పట్లో పోకిరి వంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన ఘనత ఆయనదే. ఇప్పటికే యశ్ కోసం పూరి స్టోరీ కూడా రెడీ చేశారట. డబుల్ ఇస్మార్ట్ అవగానే ఈ సినిమా స్టార్ట్ చేసేలా పూరి ప్లాన్ చేస్తున్నారట.

ఇవీ చదవండి:

వెంకటేష్‌తో సౌందర్య రిలేషన్‌లో ఉందంటూ రూమర్స్.. దానికి ఆమె ఎలా చెక్ పెట్టారంటే..

బిగ్‌బాస్ నుంచి వరుసబెట్టి అమ్మాయిలు అవుట్..

అయ్యో పాపం నరేష్.. పెళ్లి తెచ్చిన తిప్పలు..!

నేను ఎంజాయ్ చేస్తే నీకేంట్రా నొప్పి? : మంచు లక్ష్మి ఫైర్

ప్రిన్స్ యావర్‌కు మరోసారి అన్యాయం.. బీభత్సంగా పెరిగిపోతున్న సింపతి

Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ కాబోయేది ఎవరంటే ?