అయ్యో పాపం నరేష్.. పెళ్లి తెచ్చిన తిప్పలు..!

అయ్యో పాపం నరేష్.. పెళ్లి తెచ్చిన తిప్పలు..!

సీనియర్ యాక్టర్ నరేష్.. నటుడిగా ఏమంత ఫేమస్ అయ్యారో కానీ పెళ్లిళ్ల వ్యవహారంతో మాత్రం తెగ వైరల్ అవుతున్నారు. గత రెండేళ్లుగా నరేష్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూనే ఉన్నారు. పవిత్ర లోకేష్‌తో సహజీవనం.. ఈ నేపథ్యంలో మూడో భార్య రమ్య రఘుపతితో గొడవలతో ఈ మధ్య కాలంలో నరేష్ బాగా వైరల్ అయ్యారు. దాదాపు ఐదేళ్లుగా నరేష్ నటి పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నారు. 

ఈ విషయం గత ఏడాది బయటకు రావడంతో రమ్య రఘుపతి ఫైర్ అయ్యారు. అక్కడి నుంచి గొడవలు స్టార్ట్. రమ్యను టార్గెట్ చేస్తూ చివరకు నరేష్ మళ్లీ పెళ్లి అనే సినిమా కూడా తీశారు. కాగా.. నరేష్ 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ టెలివిజన్‌ షోలో ఆయనకు సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలోకి 50 ఏళ్ళు గడిచిపోయాయన్నారు.

తన జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న అనంతరం ఈ స్థాయికి వచ్చాననని నరేష్ తెలిపారు. జీవితంలో కొన్ని తప్పులు చేశానని పేర్కొన్నారు. వాటిలో భాగమే రమ్య రఘుపతితో వివాహమని ఆయన చెప్పుకొచ్చారు. రమ్యతో పెళ్లి జరిగిందే కానీ సంతోషం లేదని.. ఆమె తనను అనేక ఇబ్బందులకు గురి చేసిందన్నారు. అసలు తన కొడుకు ఆమె వద్ద ఉండటం శ్రేయస్కరం కాదని.. వాడి భవిష్యత్ గురించి భయపడుతున్నట్టు చెప్పారు. పవిత్రా లోకేష్ రాకతో తన జీవితమే మారిపోయిందని నరేష్ చెప్పుకొచ్చారు.

ఇవీ చదవండి:

నేను ఎంజాయ్ చేస్తే నీకేంట్రా నొప్పి? : మంచు లక్ష్మి ఫైర్

ప్రిన్స్ యావర్‌కు మరోసారి అన్యాయం.. బీభత్సంగా పెరిగిపోతున్న సింపతి

Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ కాబోయేది ఎవరంటే ?

Anasuya: 8 ఏళ్ల పాటు ఆయనతో సహజీవనం చేశానన్న అనసూయ..

‘సలార్’ సంక్రాంతికి కూడా విడుదల కష్టమేనట..

టాలీవుడ్‌కు గుడ్ బై చెప్పనున్న సమంత

Google News