ప్రిన్స్ యావర్‌కు మరోసారి అన్యాయం.. బీభత్సంగా పెరిగిపోతున్న సింపతి

ప్రిన్స్ యావర్‌కు మరోసారి అన్యాయం.. బీభత్సంగా పెరిగిపోతున్న సింపతి

బిగ్‌బాస్ సీజన్ 7 మూడవ వారం పూర్తికావొచ్చింది. ఈసారి హౌస్‌లో ప్రతి ఒక్కరికీ కంటెంట్ ఎలా ఇవ్వాలనే విషయం బాగా తెలుసు. దానికి తగ్గట్టుగానే వాంటెడ్‌గా గొడవలు పడుతున్నారు. ఇక ప్రిన్స్ యావర్‌కు కంటెస్టెంట్లు అంతా కలిసి దెబ్బ మీద దెబ్బ వేస్తూనే ఉన్నారు. నిన్న కంటెండర్ షిప్ కోసం శోభా శెట్టి, ప్రిన్స్ యావర్, ప్రియాంక ఎంపికయ్యారు. అయితే వారిలో ఒకరిని తొలగించే హక్కు వారికే బిగ్‌బాస్ ఇవ్వడం గమనార్హం.

ప్రియాంక, శోభా శెట్టి ఇద్దరూ స్నేహితులు కాబట్టి వారిద్దరూ కలిసి యావర్‌ను తొలగించారు. వీక్ కంటెస్టెంట్‌ను తొలిగించమంటే ఇద్దరూ కలిసి అత్యంత స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ను తొలగించారు. దీంతో ప్రిన్స్ యావర్‌కు కావల్సిన దానికంటే కాస్త ఎక్కువే సింపతి ప్రేక్షకుల నుంచి దక్కింది. ఇక శోభ, ప్రియాంకలకు ఒక టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. యంత్రపు ఎద్దు మీద ఎక్కి ఎక్కువ సమయం కింద పడకుండా ఉంటారో వారే విజేతలని బిగ్ బాస్ చెప్పాడు.

ఈ క్రమంలోనే శోభ కిందపడిపోవడంతో ఆమెకు చేతికి గాయమైంది. ఇక ఈ క్రమంలోనే మరోవైపు తనను కంటెండర్ షిప్ నుంచి తొలగించడంతో యావర్ చాలా అగ్రెసివ్ అయిపోయాడు. ఆ తరువాత శివాజీ దగ్గరకు వెళ్లి చాలా ఎమోషనల్ అయిపోయాడు. తను కనీసం తినడానికి తిండి దొరక్క ఎంత కష్టపడింది తదితర విషయాలు చెప్పుకుని ఆవేదన చెందాడు. ప్రేక్షకులు అంతా చూస్తున్నారని శివాజీ ధైర్యం చెప్పాడు. ఇక నేడు హోస్ట్ నాగార్జున వచ్చి కంటెస్టెంట్స్‌ను ఏమేం అడుగుతారనేది ఆసక్తికరంగా మారింది.

ఇవీ చదవండి:

Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ కాబోయేది ఎవరంటే ?

Anasuya: 8 ఏళ్ల పాటు ఆయనతో సహజీవనం చేశానన్న అనసూయ..

‘సలార్’ సంక్రాంతికి కూడా విడుదల కష్టమేనట..

టాలీవుడ్‌కు గుడ్ బై చెప్పనున్న సమంత

Bigg Boss 7 Telugu: హాట్ టాపిక్ అవుతున్న రతిక, యావర్

త్రిష పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా?

ఆ సీన్ చేశాక పదే పదే ముఖం కడుక్కొన్నా: సదా

Google News