ఆ సీన్ చేశాక పదే పదే ముఖం కడుక్కొన్నా: సదా

ఆ సీన్ చేశాక పదే పదే ముఖం కడుక్కొన్నా: సదా

హీరోయిన్ సదా పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చే సినిమా ‘జయం’. ఈ సినిమా సాధించినంత సక్సెస్ ఆమె నటించిన మరే సినిమాలూ సాధించలేదంటే అతిశయోక్తి కాదేమో. ఈ సినిమాలో పాటలు.. డైలాగ్స్ అన్నీ ఇప్పటికీ ఫేమసే. ‘వెళ్లవయ్యా వెళ్లూ’ అంటూ చెప్పే డైలాగ్ ఇప్పటికీ యువతులు చెబుతూనే ఉంటారు. ఇక ఎందుకోగానీ ఈ సినిమా తర్వాత పెద్దగా సక్సెస్ కాలేకపోయింది సదా. దీంతో సినిమాలకు బై చెప్పేసింది.

ప్రస్తుతం రియాల్టీ షోలలో జడ్జిగా వ్యవహరిస్తోంది. అయితే తాజాగా సదా మరోసారి తను నటించిన జయం మూవీని గుర్తు చేసుకుంది. ఈ సినిమాలో ఓ సీన్ చేసినందుకు తాను ఇప్పటికీ బాధపడుతూ ఉంటానని చెప్పింది. ఇందులో హీరోగా నితిన్ నటించగా.. విలన్‌గా గోపీచంద్ నటించాడు. జయం మూవీలో ఓ సీన్‍‌లో భాగంగా సదా బుగ్గను గోపీచంద్ నాలుకతో నాకుతాడు. ఈ సీన్‌లో నటించడం తనకు ఏమాత్రం ఇష్టం లేదంటూ సదా తెలిపింది.

ఆ సీన్ చేశాక పదే పదే ముఖం కడుక్కొన్నా: సదా

‘జయం’ సినిమాలో ఆ సీన్‌లో నటించినందుకు ఇప్పటికీ బాధపడుతూ ఉంటానని సదా వెల్లడించింది. అయితే ఈ సీన్ చేయడానికి ముందే దర్శకుడు తేజకు విషయం చెప్పానని కానీ ఆయన తన మాట వినలేదని వెల్లడించింది. మూవీకే ఆ సన్నివేశం హైలైట్‌గా నిలుస్తుందని చెప్పి సదాను తేజ ఒప్పించారట. అయితే ఆ సీన్ పూర్తయిన తర్వాత ఇంటికెళ్లి చాలాసేపు ఏడ్చిందట. పదే పదే తన ముఖాన్ని కడుక్కుందట. ఇప్పటికీ ఆ సీన్ టీవీలో వస్తే ఆ దరిదాపుల్లో కూడా ఉండనని సదా తెలిపింది.

ఇవీ చదవండి:

మళ్లీ పల్లవి ప్రశాంత్‌కు దగ్గరవుతున్న రతిక

హీరో నవదీప్ ఇంట్లో నార్కోటిక్ బ్యూరో సోదాలు

ఇవన్నీ ఏంటంటూ తల్లి సురేఖపై శ్రీజ ఫైర్..

నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోడట.. కానీ హీరోయిన్ తో రిలేషన్‌పై..

హీరో విజయ్ ఆంటోని కూతురి ఆత్మహత్య

Pushpa 2: పుష్ఫ 2 నుంచి అదిరిపోయే అప్‌డేట్..

బిగ్‌బాస్ నుంచి షకీల అవుట్..

Google News