హీరో విజయ్ ఆంటోని కూతురి ఆత్మహత్య

హీరో విజయ్ ఆంటోని కూతురి ఆత్మహత్య

‘బిచ్చగాడు’ హీరో విజయ్ ఆంటోని ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన కూతురు మీరా (17) నేటి తెల్లవారుజామున 3 గంటలకు ఆత్మహత్యకు పాల్పడింది. చెన్నైలోని చర్చి పార్క్ కాలేజ్‌లో మీరా ఇంటర్ సెంకడియర్ చదువుతున్న మీరా.. చదువుల ఒత్తిడిని భరించలేకే మీరా ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని భావిస్తున్నారు. విజయ్ ఆంటోనికి మీరా ఏకైక సంతానం. దీంతో విజయ్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

విజయ్ కుటుంబం చెన్నైలోని డీడీకే రోడ్డులో నివాసం ఉంటోంది. మీరా మృతికి చదువుల ఒత్తిడే కారణమని భావిస్తున్నప్పటికీ అదే అసలు కారణమా? మరేదైనా ఉందా? అనేది తెలియాల్సి ఉంది. విజయ్ ఆంటోని అయితే ఇప్పటి వరకూ తన కూతురి మృతిపై స్పందించలేదు. కాగా.. విజయ్ ఆంటోని కూతురి మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

 అసలు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటారు? ఆ ఆలోచనలు ఎందుకు వస్తాయ్ అనేదానిపై గతంలో విజయ్ ఆంటోని మాట్లాడాడు. సూసైడ్ థాట్స్ గురించి తన అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఎవరినైనా అతిగా నమ్మి మోసపోవడం, చెప్పిన పని చేయలేకపోయినప్పుడు.. చిన్నపిల్లలకు అయితే చదువుల పరంగా ఒత్తిడిని ఎదుర్కొన్నప్పుడు సూసైడ్ థాట్స్ వస్తాయని విజయ్ ఆంటోని తెలిపాడు. ఇంత అవగాహన ఉన్న విజయ్ తన ఒక్కగానొక్క కూతురు డిప్రెషన్‌కు లోనవకుండా ధైర్యం చెప్పుకుంటాడు కదా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇవీ చదవండి:

Pushpa 2: పుష్ఫ 2 నుంచి అదిరిపోయే అప్‌డేట్..

బిగ్‌బాస్ నుంచి షకీల అవుట్..

SIIMA2023 : ఉత్తమ నటుడు ఎన్టీఆర్.. సత్తా చాటిన మృణాల్

ప్రభాస్ మూవీ నుంచి సీన్ లీక్..

బిగ్‌బాస్ సీజన్ 7.. ఈసారి హౌస్ నుంచి పల్లవి ప్రశాంత్ ఔట్..!

హీరో నవదీప్‌కు నోటీసులు..!