ప్రభాస్ మూవీ నుంచి సీన్ లీక్..

ప్రభాస్ మూవీ నుంచి సీన్ లీక్..

ప్రభాస్ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాడు. ‘ఆదిపురుష్’ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో తన తరువాతి చిత్రాలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాడు. ఇక ప్రస్తుతం ప్రభాస్ నటించిన సలార్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ చిత్రం పక్కా హిట్ అవుతుందని టాక్. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించడంతో బ్లాక్ బస్టర్ హిట్ పక్కా అని అంతా భావిస్తున్నారు. 

సలార్ మూవీ అనుకున్న సమయానికి రాకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహానికి గురయ్యారు. అయితే కొత్త తేదీ ప్రకటన త్వరలోనే రానుంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న కల్కి, మారుతీ దర్శకత్వంలో మరో మూవీ షూటింగ్ జరుపుకుంటోంది. కల్కి మూవీ నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ మూవీగా రూపొందుతోంది. రూ.500 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఇటీవల విడుదలైంది. 

ఇక మారుతి మూవీ ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. లేటెస్ట్ షెడ్యూల్‌లో భాగంగా ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాలను చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. తాజాగా సెట్స్ నుంచి ఓ వీడియో లీకైంది. హీరోయిన్ మాళవిక మోహన్ మీద ఫైట్ ఎపిసోడ్‌ను మారుతి రూపొందిస్తున్నారు. ఈ ఫైట్ ఎపిసోడ్‌కి సంబంధించినదే ఒక సీన్ లీకైంది. మాళవికకు రోప్స్ కట్టారు. ఆమె గాల్లోకి ఎగిరి రౌడీలను తంతున్న సీన్ అది.

ఇవీ చదవండి:

బిగ్‌బాస్ సీజన్ 7.. ఈసారి హౌస్ నుంచి పల్లవి ప్రశాంత్ ఔట్..!

హీరో నవదీప్‌కు నోటీసులు..!

యాంకర్ శ్రీముఖి.. ఫుల్లు హాట్ ఫోటో షూట్..

వామ్మో.. జయలలితను భర్త ఎలా టార్చర్ చేశాడో తెలిస్తే..!

రెండుగా విడిపోయిన బిగ్‌బాస్ హౌస్.. గేమ్ షురూ!

తన హాట్ ఫోటోపై నెటిజన్ కామెంట్‌కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన రష్మి