రెండుగా విడిపోయిన బిగ్‌బాస్ హౌస్.. గేమ్ షురూ!

రెండుగా విడిపోయిన బిగ్‌బాస్ హౌస్.. గేమ్ షురూ!

బిగ్‌బాస్ సీజన్ 7 ప్రారంభమై రెండో వారం నడుస్తోంది. ఈసారి మాత్రం బిగ్‌బాస్ నిర్వాహకులు కాస్త గట్టిగానే ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఫస్ట్ వీక్ కాస్త సో సోగా అనిపించింది. తొలివారం కిరణ్ రాథోడ్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. ఇక ఈ వారం నామినేషన్లు గట్టిగానే నడిచాయి. ఇక ఇప్పటికే హౌస్‌లో పవర్ అస్త్ర సాధించి ఆట సందీప్ 5 వారాలు ఇమ్యూనిటీ పొందిన విషయం తెలిసిందే.

మరో పవర్ అస్త్ర కోసం బిగ్‌బాస్ గేమ్ షురూ చేశాడు. దీనికోసం ఇంటి సభ్యులను రెండుగా విభజించాడు. ఒక టీమ్‌లో శివాజీ, షకీలా, అమర్ దీప్, ప్రిన్స్ యావర్, శోభా శెట్టి, ప్రియాంక సింగ్ ఉన్నారు. ఈ టీమ్‌కు రణధీర అని బిగ్‌బాస్ పేరు పెట్టారు. ఇక మరో టీమ్‌లో గౌతమ్ కృష్ణ, పల్లవి ప్రశాంత్, టేస్టీ తేజ, రతిక, శుభశ్రీ, దామిని ఉన్నారు. ఈ టీమ్‌కు మహాబలి అని పేరు పెట్టడం జరిగింది. ఆట సందీప్ సంచలాకుడు.

రెండుగా విడిపోయిన బిగ్‌బాస్ హౌస్.. గేమ్ షురూ!

ఇంట్లో ఒక మాయాస్త్ర ఉందని.. దాని కోసం రెండు టీమ్‌లూ పోటీ పడాలని బిగ్‌బాస్ తెలిపారు. గెలిచిన టీమ్‌కి మాయాస్త్ర దక్కుతుంది. ఇక ఈ మాయాస్త్ర దక్కించుకున్న టీమ్ సభ్యుల నుంచి ఒకరికి పవర్ అస్త్ర గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఇక ఈ మాయాస్త్ర గెలుచుకున్న సభ్యుడు రెండో హౌస్‌మేట్ కావడానికి ఆస్కారం ఉంది. అలాగే వీఐపీ రూమ్ యాక్సెస్ కూడా దొరుగుతుంది. మొత్తానికి ఈ సారి బిగ్‌బాస్ కాస్త ఇంట్రస్టింగ్‌గానే ఉంది.

ఇవీ చదవండి:

తన హాట్ ఫోటోపై నెటిజన్ కామెంట్‌కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన రష్మి

ఓ పార్టీ అధినేత.. తనను వాడుకుని 7 సార్లు అబార్షన్ చేయించాడంటూ హీరోయిన్ సంచలనం..

ఆ సినిమా చూసి మా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేశాం: మహేష్ బాబు

కేవలం ఆ కారణంగానే కిరణ్ రాథోడ్ ఎలిమినేట్

అక్కడ అడుగు పెట్టగానే కళ్లలో నీళ్లు తిరిగాయి: అనుష్క

బిగ్‌బాస్ తెలుగు 7.. బిగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్న నిర్వాహకులు

Google News