తన హాట్ ఫోటోపై నెటిజన్ కామెంట్‌కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన రష్మి

తన హాట్ ఫోటోపై నెటిజన్ కామెంట్‌కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన రష్మి

సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి, హీరో ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సనాతన ధర్మాన్ని దోమలతో పోలుస్తూ.. ఎలాగైతే దోమలు మలేరియా, డెంగ్యూ వ్యాప్తి చేస్తాయో సనాతన ధర్మం కూడా సమాజానికి హానికరం అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీతో పాటు కొన్ని సామాజిక వర్గాల నుంచి బీభత్సమైన వ్యతిరేకత వచ్చింది. అయినా కూడా ఉదయనిధి తన వ్యాఖ్యలపై ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. 

ఈ వ్యాఖ్యల విషయంలో ఇండస్ట్రీ కూడా రెండుగా విడిపోయింది. ప్రకాష్ రాజ్, సత్యరాజ్‌తో పాటు పలువురు ఉదయనిధి స్టాలిన్‌కు మద్దతుగా నిలవగా.. టాలీవుడ్‌ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తదితరులు ఉదయనిధి వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నారు. తాజాగా వ్యతిరేకించే వారి లిస్ట్‌లో యాంకర్ రష్మి కూడా చేరింది. తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా సనాతన ధర్మానికి మద్దతుగా ఓ పోస్ట్ పెట్టింది.

తన హాట్ ఫోటోపై నెటిజన్ కామెంట్‌కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన రష్మి

రష్మి పోస్టుపై సనాతన ధర్మాన్ని వ్యతిరేకించేవారు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. తాజాగా ఓ నెటిజన్ రష్మికి సంబంధించిన ఒక హాట్ ఫోటో షేర్ చేసి సనాతన ధర్మంలో దీనికి కూడా స్థానముందా? అని ప్రశ్నించాడు. ఇలా చేయవచ్చా? అని ఆమెను నిలదీశారు. దీనిపై రష్మి స్పందిస్తే.. కేవలం వాదన గెలవలేని వారు ఇలాంటి పనులకు తెగబడతారని కామెంట్ పెట్టింది. ఏదైనా ఒక విషయంపై ఆర్గ్యూ చేయాలని తెలిపింది. మొత్తానికి నెటిజన్ కామెంట్‌కు రష్మి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది.

ఇవీ చదవండి:

ఓ పార్టీ అధినేత.. తనను వాడుకుని 7 సార్లు అబార్షన్ చేయించాడంటూ హీరోయిన్ సంచలనం..

ఆ సినిమా చూసి మా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేశాం: మహేష్ బాబు

కేవలం ఆ కారణంగానే కిరణ్ రాథోడ్ ఎలిమినేట్

అక్కడ అడుగు పెట్టగానే కళ్లలో నీళ్లు తిరిగాయి: అనుష్క

బిగ్‌బాస్ తెలుగు 7.. బిగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్న నిర్వాహకులు

నా ఆరోగ్యం అస్సలు బాగోలేదు.. క్రిటికల్ కండీషన్‌లో ఉన్నా: గాయత్రి గుప్తా

నా కొడుకును బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నాడు: విజయ్ దేవరకొండ తండ్రి సంచలనం