హీరో నవదీప్‌కు నోటీసులు..!

హీరో నవదీప్‌కు నోటీసులు..!

టాలీవుడ్‌ను మరోసారి డ్రగ్స్ కేసు కుదిపేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే డ్రగ్స్ వాడిన నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్నట్టు తేలడంతో హీరో నవదీప్‌కు నోటీసులు జారీ చేయనున్నారు. నిన్న పోలీసులకు అందుబాటులోకి నవదీప్ వచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు షాడో సినిమా యూనిట్ మెన్ ఉప్పలపాటి రవికి కూడా డ్రగ్స్ తీసుకున్నట్టు తేలిందని సమాచారం. ఆయన ఇంకా పరారీలోనే ఉన్నారు.

మరోవైపు పలు పబ్‌ల పైనా నార్కోటిక్ పోలీసులు నిఘా పెట్టారు. గచ్చిబౌలిలోని స్నార్ట్ పబ్, జూబ్లీహిల్స్‌లోని టెర్రా కేఫ్ అండ్ బిస్ట్రో లో డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయి. పరారీలో ఉన్న మోడల్ శ్వేత కోసం నార్కోటిక్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కేపీ చౌదరి లిస్ట్‌లోనూ మోడల్ శ్వేత పేరు ఉంది. ఈవెంట్ ఆర్గనైజర్ కలహార్ రెడ్డి కోసం నార్కోటిక్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

మాదాపూర్ డ్రగ్స్ కేస్ లో తవ్వుతున్న కొద్ది బయట పడుతున్న కన్స్యూమర్ల లిస్ట్ బయటకు వస్తోంది. ఈ కేసులో సినీ, రాజకీయ ప్రముఖుల పేర్లు బయటకు రావడం సంచలనంగా మారింది. జూబ్లీహిల్స్‌లో ఉన్న కోలి రాంచంద్ అనే వ్యక్తి నుంచి హీరో నవదీప్ డ్రగ్స్ తీసుకున్నట్టు అధికారుల విచారణలో తేలింది.సినీ ప్రొడ్యూసర్ సుశాంత్ రెడ్డి, హీరో నవదీప్, సినీ ఫైనాన్షియర్ వెంకట్, మరో డైరెక్టర్ రవి ఉప్పలపాటి తో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ల పేర్లు డ్రగ్స్ కేసులో వెలుగు చూస్తున్నాయి.

ఇవీ చదవండి:

యాంకర్ శ్రీముఖి.. ఫుల్లు హాట్ ఫోటో షూట్..

వామ్మో.. జయలలితను భర్త ఎలా టార్చర్ చేశాడో తెలిస్తే..!

రెండుగా విడిపోయిన బిగ్‌బాస్ హౌస్.. గేమ్ షురూ!

తన హాట్ ఫోటోపై నెటిజన్ కామెంట్‌కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన రష్మి

ఓ పార్టీ అధినేత.. తనను వాడుకుని 7 సార్లు అబార్షన్ చేయించాడంటూ హీరోయిన్ సంచలనం..

Google News