బిగ్‌బాస్ సీజన్ 7.. ఈసారి హౌస్ నుంచి పల్లవి ప్రశాంత్ ఔట్..!

బిగ్‌బాస్ సీజన్ 7.. ఈసారి హౌస్ నుంచి పల్లవి ప్రశాంత్ ఔట్..!

బిగ్‌బాస్ సీజన్ 7.. ఇంట్రస్టింగ్‌గానే వెళుతోంది. ప్రస్తుత సీజన్‌లో రతిక బాగా హైలైట్ అవుతోంది. అసలే పల్లవి ప్రశాంత్ నామినేషన్స్‌లో అతనే తన వెంటపడుతున్నాడంటూ రచ్చ చేసి ప్రేక్షకుల్లో నెగిటివిటీ తెచ్చుకునున్న రతిక.. నిన్న చేసిన రచ్చతో మరింత ఇబ్బందుల్లో పడిపోయింది. ఇక ప్రస్తుతం ఓటింగ్‌లో పల్లవి ప్రశాంత్ దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.

బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్ రెండో వారంలో ఒకరి కంటే ఎక్కువ మందినే హౌస్ నుంచి బిగ్‍బాస్ ఎలిమినేట్ చేస్తారని సోషల్ మీడియా టాక్. వీరిలో ఒకరు పల్లవి ప్రశాంత్. నిజానికి ఇది షాకింగే. టాప్‌లో ఉన్న పల్లవి ప్రశాంత్‌ను ఎలిమినేట్ చేయడమేంటి? అనిపిస్తోంది కదా. అతడిని ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూంకి పంపుపతారని ప్రచారం జరుగుతోంది. గత సీజన్లలో కూడా ఇలాగే ఎలిమినేట్ చేసి రాహుల్ సిప్లిగంజ్, అఖిల్ సార్థక్ వంటి వారిని సీక్రెట్ రూమ్‌కి పంపారు.

ఒకవేళ సీక్రెట్ రూమ్‍కు పంపితే పల్లవి ప్రశాంత్‍కు స్క్రీన్ టైమ్ పెరిగి.. అతడికి మరింత ఆదరణ పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మరోవైపు ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రస్తుతానికి అయితే ముగ్గురు ఉన్నారు. నేటి ఓటింగ్‌తో ఎవరు బయటకు వెళతారనేది తేలనుంది. దాదాపు షకీల వెళ్లడం ఖాయంగానే కనిపిస్తోంది. వయసురీత్యా ఆమె హౌస్‌లో యాక్టివ్‌గా ఉండలేకపోవడం.. టాస్క్‌ల్లోనూ పెద్దగా పెర్ఫామ్ చేయలేకపోవడం కారణంగా ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇవీ చదవండి:

హీరో నవదీప్‌కు నోటీసులు..!

యాంకర్ శ్రీముఖి.. ఫుల్లు హాట్ ఫోటో షూట్..

వామ్మో.. జయలలితను భర్త ఎలా టార్చర్ చేశాడో తెలిస్తే..!

రెండుగా విడిపోయిన బిగ్‌బాస్ హౌస్.. గేమ్ షురూ!

తన హాట్ ఫోటోపై నెటిజన్ కామెంట్‌కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన రష్మి

ఓ పార్టీ అధినేత.. తనను వాడుకుని 7 సార్లు అబార్షన్ చేయించాడంటూ హీరోయిన్ సంచలనం..

ఆ సినిమా చూసి మా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేశాం: మహేష్ బాబు

Google News