SIIMA2023 : ఉత్తమ నటుడు ఎన్టీఆర్.. సత్తా చాటిన మృణాల్

SIIMA2023 : ఉత్తమ నటుడు ఎన్టీఆర్.. సత్తా చాటిన మృణాల్

సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ – 2023 వేడుక దుబాయిలో అట్టహాసంగా జరిగింది. తొలి రోజు తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలకు సంబంధించిన నటీనటులు హాజరయ్యారు. 2023 సంవత్సరానికి గానూ ఉత్తమ నటుడిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అవార్డు అందుకున్నారు. ఆర్ఆర్ఆర్‌ చిత్రంలో తారక్ నటన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఆ సినిమాలో నటనకే ఈ అవార్డును ఎన్టీఆర్ అందుకున్నాడు.

SIIMA2023 : ఉత్తమ నటుడు ఎన్టీఆర్.. సత్తా చాటిన మృణాల్

ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ పాత్రకు ఏదో లోటు చేశారని కాస్త నిరాశలో ఉన్న ఫ్యాన్స్‌ను ఈ న్యూస్ ఆనందంలో ముంచెత్తింది. ఉత్తమ నటిగా శ్రీలీల అవార్డును గెలుచుకుంది. ధమాకా చిత్రంలో శ్రీలీల నటనకు ఈ అవార్డు లభించింది. ఇక ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి, ఉత్తమ చిత్రంగా సీతారామం ఎంపికయ్యాయి. ఉత్తమ సహాయ నటుడిగా భీమ్లా నాయక్ చిత్రానికి గానూ రానా అందుకున్నాడు. ఇక సైమా అవార్డ్స్‌లో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హవా నడిచింది. ఆమె రెండు విభాగాల్లో అవార్డును సొంతం చేసుకుంది.

‘సైమా’ 2023 అవార్డుల విజేతలు ఎవరంటే..

ఉత్తమ నటుడు: ఎన్టీఆర్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)

ఉత్తమ నటి: శ్రీలీల (ధమాకా)

ఉత్తమ దర్శకుడు: ఎస్‌.ఎస్‌.రాజమౌళి (ఆర్‌ఆర్‌ఆర్‌)

ఉత్తమ చిత్రం: సీతారామం (వైజయంతి మూవీస్‌)

ఉత్తమ సహాయ నటుడు: రానా (భీమ్లా నాయక్‌)

ఉత్తమ సహాయ నటి: సంగీత (మసూద)

ఉత్తమ విలన్‌: సుహాస్‌ (హిట్‌2)

ఉత్తమ హాస్య నటుడు: శ్రీనివాస్‌రెడ్డి (కార్తికేయ2)

ఉత్తమ పరిచయ నిర్మాత (తెలుగు): శరత్‌, అనురాగ్‌ (మేజర్‌)

ఉత్తమ పరిచయ నటి: మృణాల్‌ ఠాకూర్‌ (సీతారామం)

ఉత్తమ సంగీత దర్శకుడు: ఎం.ఎం.కీరవాణి (ఆర్‌ఆర్ఆర్‌)

ఉత్తమ సినిమాటోగ్రఫీ: కె.కె.సెంథిల్‌ కుమార్‌ (ఆర్‌ఆర్ఆర్‌)

ఉత్తమ గీత రచయిత: చంద్రబోస్‌ (నాటు నాటు)

ఉత్తమ నేపథ్య గాయకుడు: రామ్‌ మిర్యాల (డీజే టిల్లు)

ఉత్తమ పరిచయ దర్శకుడు: మల్లిడి వశిష్ట (బింబిసార)

సెన్సేషన్‌ఆఫ్‌ ది ఇయర్‌ : నిఖిల్‌, కార్తికేయ2

ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): అడవి శేష్‌ (మేజర్‌)

ఉత్తమ నటి (క్రిటిక్స్‌): మృణాల్‌ ఠాకూర్‌ (సీతారామం)

ఫ్లిప్‌కార్ట్‌ ఫ్యాషన్‌ యూత్‌ ఐకాన్‌: శ్రుతి హాసన్‌

ప్రామిసింగ్‌ న్యూకమర్‌ (తెలుగు): బెల్లంకొండ గణేష్‌

ఇవీ చదవండి:

ప్రభాస్ మూవీ నుంచి సీన్ లీక్..

బిగ్‌బాస్ సీజన్ 7.. ఈసారి హౌస్ నుంచి పల్లవి ప్రశాంత్ ఔట్..!

హీరో నవదీప్‌కు నోటీసులు..!

యాంకర్ శ్రీముఖి.. ఫుల్లు హాట్ ఫోటో షూట్..

వామ్మో.. జయలలితను భర్త ఎలా టార్చర్ చేశాడో తెలిస్తే..!

రెండుగా విడిపోయిన బిగ్‌బాస్ హౌస్.. గేమ్ షురూ!

తన హాట్ ఫోటోపై నెటిజన్ కామెంట్‌కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన రష్మి

ఓ పార్టీ అధినేత.. తనను వాడుకుని 7 సార్లు అబార్షన్ చేయించాడంటూ హీరోయిన్ సంచలనం..

Google News