బిగ్‌బాస్ నుంచి షకీల అవుట్..

బిగ్‌బాస్ నుంచి షకీల అవుట్..

బిగ్‌బాస్ సీజన్ 7 ఆసక్తికరంగానే నడుస్తోంది. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌లో ఒకరిద్దరు మినహా ప్రతి ఒక్కరూ బీభత్సంగా కంటెంట్ ఇచ్చేందుకు ట్రై చేస్తున్నారు. దీంతో షో ఆసక్తికంగానే నడుస్తోంది. ఇక ఈసారి నామినేషన్స్‌లో 9 మంది ఉన్నారు. గత వారం హస్ నుంచి కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అవగా ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.

ఎందుకంటే.. ఈ వారం లాస్ట్‌లో ముగ్గురు కంటెస్టెంట్స్ సేమ్ ఓటింగ్‌తో ఉన్నారు. వారిలో శోభ, షకీల, టేస్టీ తేజ ఉన్నారు. దాదాపు శోభ ఎలిమినేట్ అవడం ఖాయం అనుకున్నారు కానీ లాస్ట్ డే ఓటింగ్‌లో షకీల వెనుకబడిపోయారు. అది కూడా చాలా స్వల్ప తేడాతో మాత్రమే. దీంతో ఈ వారం షకీల ఎలిమినేట్ అయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఎలిమినేషన్ ప్రోగ్రాం కూడా పూర్తైంది.

ఇక షకీల ఎలిమినేట్ అవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అసలు ఆమె నుంచి కంటెంట్ అనేది రావడం లేదు. ఆమెకు మంచి వ్యక్తిగా పేరుంది. కానీ కంటెంట్ రాకుంటే ఎలా? పైగా ప్రమోషన్స్ అసలు ఏమాత్రం ఆమె తరుఫున ఎవరూ చేయడం లేదు. బిగ్‌బాస్‌కి వెళ్లడానికి ముందే అంతా సెట్ చేసుకుని మరీ వస్తున్నారు. కానీ కిరణ్ రాథోడ్, షకీల ఇద్దరూ అలాంటిదేమీ లేకుండా వచ్చేశారు. దీంతో ఇద్దరూ ఎలిమినేట్ అయిపోయారు.

SIIMA2023 : ఉత్తమ నటుడు ఎన్టీఆర్.. సత్తా చాటిన మృణాల్

ప్రభాస్ మూవీ నుంచి సీన్ లీక్..

బిగ్‌బాస్ సీజన్ 7.. ఈసారి హౌస్ నుంచి పల్లవి ప్రశాంత్ ఔట్..!

హీరో నవదీప్‌కు నోటీసులు..!

యాంకర్ శ్రీముఖి.. ఫుల్లు హాట్ ఫోటో షూట్..

వామ్మో.. జయలలితను భర్త ఎలా టార్చర్ చేశాడో తెలిస్తే..!

Google News