నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోడట.. కానీ హీరోయిన్ తో రిలేషన్‌పై..

నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోడట.. కానీ హీరోయిన్ తో రిలేషన్‌పై..

హీరో నాగ చైతన్య ప్రస్తుతం హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో రిలేషన్‌లో ఉన్నాడంటూ బీభత్సంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీనికి కారణాలు లేకపోలేదు. వీరిద్దరూ విదేశాల్లో విహరిస్తున్న పిక్స్ కొన్ని నెటిజన్ల కంటపడ్డాయి. అలాగే ఒక బుక్ గురించి ఇద్దరూ మాట్లాడటం వంటి అంశాలు వీరి రిలేషన్‌కు బలాన్ని చేకూర్చాయి. తాజాగా నాగ చైతన్య ఒక అనూహ్య నిర్ణయం తీసుకున్నాడంటూ ప్రచారం జరుగుతోంది.

నాగ చైతన్య గురించి నేషనల్ మీడియాలో ఒక కథనం వచ్చింది. ఇప్పుడు అది టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నాగ చైతన్య రెండో పెళ్ళిపై వస్తున్న రూమర్స్‌పై క్లారిటీ కోసం ఓ నేషనల్ మీడియా చైకి అత్యంత సన్నిహితులను సంప్రదించిందట. సన్నిహితుల కథనం మేరకు చై సెకండ్ మ్యారేజ్ చేసుకునే ఛాన్సే లేదట. నిజంగానే శోభితా ధూళిపాళ్లతో చైతు రిలేషన్‌లో ఉన్నాడని అతని సన్నిహితులు ధృవీకరించారని నేషనల్ మీడియా చెబుతోంది.

నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోడట.. కానీ హీరోయిన్ తో రిలేషన్‌పై..

అలాగే త్వరలో తమ రిలేషన్‌ను చైతు బహిర్గం చేయనున్నారని కూడా అతని సన్నిహితులు చెప్పారట. నిజానికి ఇండస్ట్రీలో చాటుమాటు వ్యవహారాలు నడపడం అనేది సర్వసాధారణం కానీ ఇలా అధికారికంగా ప్రకటించినదైతే లేదనే చెప్పాలి. ఇక కెరీర్ విషయానికి వస్తే చైతుకి ఇటీవలి కాలంలో వరుస పరాజయాలు తప్ప హిట్ పడిన దాఖలాలే లేవు. చై ఇప్పుడు వెబ్ సిరీస్‌లో సైతం నటించాడు. అది ఇంకా స్ట్రీమింగ్ అవలేదు. మరి ఇదెలా ఉంటుందో చూడాలి.

ఇవీ చదవండి:

హీరో విజయ్ ఆంటోని కూతురి ఆత్మహత్య

Pushpa 2: పుష్ఫ 2 నుంచి అదిరిపోయే అప్‌డేట్..

బిగ్‌బాస్ నుంచి షకీల అవుట్..

SIIMA2023 : ఉత్తమ నటుడు ఎన్టీఆర్.. సత్తా చాటిన మృణాల్

ప్రభాస్ మూవీ నుంచి సీన్ లీక్..

బిగ్‌బాస్ సీజన్ 7.. ఈసారి హౌస్ నుంచి పల్లవి ప్రశాంత్ ఔట్..!

హీరో నవదీప్‌కు నోటీసులు..!

Google News