మళ్లీ పల్లవి ప్రశాంత్‌కు దగ్గరవుతున్న రతిక

మళ్లీ పల్లవి ప్రశాంత్‌కు దగ్గరవుతున్న రతిక

బిగ్‌బాస్ సీజన్ 7.. మొత్తానికి రెండు వారాలు పూర్తై మూడో వారం నడుస్తోంది. ఇప్పటి వరకూ కిరణ్ రాథోడ్, షకిల హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇక మూడో వారం నామినేషన్లలో ఒక ఆసక్తికర విషయం ఏంటంటే.. ఎవరూ కూడా పల్లవి ప్రశాంత్ జోలికి వెళ్లలేదు. గత వారం నామినేషన్స్‌లో మూకుమ్మడిగా పల్లవి ప్రశాంత్‌ను నామినేట్ చేయడంతో ప్రేక్షకుల్లో బీభత్సమైన సింపతి వర్కవుట్ అయ్యింది.

ఈ విషయం తెలిసి సైలెంట్ అయ్యారా? మరింకేంటో కానీ ప్రశాంత్‌ని మాత్రం వదిలేశారు. ఇక మళ్లీ రతిక వచ్చేసి కాస్త పల్లవి ప్రశాంత్‌తో క్లోజ్ అవుతోంది. దీనికి కారణం లేకపోలేదు. శివాజీ, పల్లవి ప్రశాంత్, రతిక నామినేషన్స్‌లో లేరు. కాబట్టి రతిక వాళ్లిద్దరితో ఎక్కువ సమయం గడుపుతోంది. చాలా స్ట్రాటజికల్‌గా రతిక ఆట ఆడుతోందని అనిపిస్తోంది. మొన్నటికి మొన్న శివాజీకి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉండవచ్చనో ఏమో కానీ అతనితోనే నిలబడింది.

మళ్లీ పల్లవి ప్రశాంత్‌కు దగ్గరవుతున్న రతిక

ఇక రెండో వారం నామినేషన్స్ సమయంలో రతికకు చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది. పల్లవి ప్రశాంత్‌తో అప్పటి వరకూ క్లోజ్‌గా ఉండి ఒక్కసారిగా రివర్స్ అయిపోవడంతో ప్రేక్షకులు షాక్ అయ్యారు. దీంతో రతికపై ట్రోల్స్ వెల్లువెత్తాయి. తనను పల్లవి ప్రశాంత్ ఇంప్రెస్ చేయాలని చూస్తున్నాడంటూ అందరికీ చెప్పడం వంటివి చేసింది. ఆ తరువాత మళ్లీ ఇప్పుడు పల్లవి ప్రశాంత్‌కు దగ్గరవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇవీ చదవండి:

హీరో నవదీప్ ఇంట్లో నార్కోటిక్ బ్యూరో సోదాలు

ఇవన్నీ ఏంటంటూ తల్లి సురేఖపై శ్రీజ ఫైర్..

నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోడట.. కానీ హీరోయిన్ తో రిలేషన్‌పై..

హీరో విజయ్ ఆంటోని కూతురి ఆత్మహత్య

Pushpa 2: పుష్ఫ 2 నుంచి అదిరిపోయే అప్‌డేట్..

బిగ్‌బాస్ నుంచి షకీల అవుట్..

Google News