హీరో నవదీప్ ఇంట్లో నార్కోటిక్ బ్యూరో సోదాలు

హీరో నవదీప్ ఇంట్లో నార్కోటిక్ బ్యూరో సోదాలు

మాదాపూర్‌ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టాలీవుడ్ హీరో నవదీప్ ఇంట్లో నేడు నార్కోటిక్ బ్యూరో సోదాలు నిర్వహించింది. నవదీప్‌ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే పోలీసులు సోదాలు నిర్వహించే సమయంలో నవదీప్ ఇంట్లో లేడని తెలుస్తోంది. గత నెల 31న మాదాపూర్‌లోని ఫ్రెష్‌ లివింగ్‌ అపార్ట్‌మెంట్స్‌లో డ్రగ్ పార్టీ జరిగింది. 

పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన నాబ్ అధికారులు ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే నవదీప్‌ను అరెస్ట్‌ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలిచ్చివ్వడంతో అతడిని అరెస్ట్ చేయలేదు. అంతేకాకుండా ఇదే కేసులో నవదీప్ ఇప్పటికే మరో పిటిషన్ సైతం దాఖలు చేశాడు. దీనిపై నార్కోటిక్ బ్యూరో పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. కాగా.. ఈ కేసులో నవదీప్ స్నేహితుడు రామ్‌చంద్ ఇప్పటికే పట్టుబడ్డాడు.

రామ్‌చంద్‌ను విచారించగా నవదీప్ పేరు వెలుగులోకి వచ్చింది. నవదీప్‌తో కలిసి డ్రగ్స్ తీసుకున్నట్టు రామ్ చంద్ పోలీసులకు తెలిపాడు. దీంతో టీఎస్‌ నాబ్‌ అధికారులు నవదీప్‌ను సైతం ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. అయితే నవదీప్‌ను మంగళవారం వరకూ అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే పోలీసులు మాత్రం నవదీప్‌ను త్వరలోనే అరెస్ట్‌ చేస్తామని చెబుతున్నారు. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం నవదీప్ యత్నిస్తున్నాడు.

ఇవీ చదవండి:

ఇవన్నీ ఏంటంటూ తల్లి సురేఖపై శ్రీజ ఫైర్..

నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోడట.. కానీ హీరోయిన్ తో రిలేషన్‌పై..

హీరో విజయ్ ఆంటోని కూతురి ఆత్మహత్య

Pushpa 2: పుష్ఫ 2 నుంచి అదిరిపోయే అప్‌డేట్..

బిగ్‌బాస్ నుంచి షకీల అవుట్..

SIIMA2023 : ఉత్తమ నటుడు ఎన్టీఆర్.. సత్తా చాటిన మృణాల్

Google News