త్రిష పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా?

త్రిష పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా?

ఇండస్ట్రీలో పెళ్లికాని హీరోయిన్స్ విషయానికి వస్తే.. ముందు వరుసలో త్రిష ఉంటుంది. 40 ఏళ్ల వయసొచ్చినా సరే వన్నె తగ్గని అందంతో.. స్లిమ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా గడిపేస్తోంది. ఈ ముద్దుగుమ్మ పెళ్లాడబోయేది ఓ ప్రముఖ నిర్మాతనని తెలుస్తోంది. ఇంత సడెన్‌గా నిర్మాతతో త్రిష పెళ్లి అంటూ న్యూస్ బయటకు వచ్చింది కాబట్టి ఇది నిజమేనని అంతా అనుకుంటున్నారు.

టాలీవుడ్‌లో అతి ఎక్కువ కాలం హీరోయిన్‌గా తన స్థానాన్ని కాపాడుకుంటూ వస్తున్న వారిలో త్రిష కూడా ఒకరు. ‘వర్షం’ మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టి టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా అనతి కాలంలోనే ఎదిగింది. ఇప్పుడు తెలుగులో అవకాశాలు తగ్గినా కూడా ఇతర భాషల్లో చక్కగానే రాణిస్తోంది. ’96’ మూవీ త్రిష కెరీర్‌నే టర్న్ చేసింది. ఆ తరువాత ఇక మళ్లీ అవకాశాల మీద అవకాశాలు త్రిషకు వస్తూనే ఉన్నాయి. 

ఇక త్రిషకు పెళ్లి కుదిరిందనేది తాజాగా వినిపిస్తున్న న్యూస్. ఓ మళయాళ నిర్మాతతో పెళ్లిపీటలు ఎక్కనుందట. త్వరలోనే త్రిష పెళ్లికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వస్తుందంటున్నారు. నిజానికి 2015లో వరుణ్ మణియన్ అనే బిజినెస్‌మ్యాన్‌తో త్రిషకు నిశ్చితార్థం జరిగింది. ఎందుకో కానీ ఆ తరువాత వీరు పెళ్లిపీటలు ఎక్కలేదు. ఇద్దరి మధ్య ఏవో విభేదాలు తలెత్తాయని టాక్. మరి ఇప్పుడు వచ్చిన వార్తలో నిజమెంతో తెలియాల్సి ఉంది.

ఇవీ చదవండి:

ఆ సీన్ చేశాక పదే పదే ముఖం కడుక్కొన్నా: సదా

మళ్లీ పల్లవి ప్రశాంత్‌కు దగ్గరవుతున్న రతిక

హీరో నవదీప్ ఇంట్లో నార్కోటిక్ బ్యూరో సోదాలు

ఇవన్నీ ఏంటంటూ తల్లి సురేఖపై శ్రీజ ఫైర్..

నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోడట.. కానీ హీరోయిన్ తో రిలేషన్‌పై..

హీరో విజయ్ ఆంటోని కూతురి ఆత్మహత్య

Google News