Bigg Boss 7 Telugu: హాట్ టాపిక్ అవుతున్న రతిక, యావర్

హాట్ టాపిక్ అవుతున్న రతిక, యావర్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7.. మూడో వారం కూడా సగం పూర్తైంది. ఇక ఈ హౌస్‌లో రతిక యవ్వారం తెగ వైరల్ అవుతోంది. తొలి వారంలో పల్లవి ప్రశాంత్‌ను లవ్ ట్రాక్‌లోకి దింపిన రతిక ఆ తరువాత ప్లేటు ఫిరాయించింది. ఒక్కసారిగా నామినేషన్స్‌లో ప్రశాంత్‌పై రివర్స్ అయ్యింది. దీంతో చూస్తున్న ప్రేక్షకులు సైతం షాక్ అయ్యారు. దాంతో కొంత వరకూ రతికను ప్రశాంత్ కాస్త దూరం పెడుతున్నాడనే చెప్పాలి.

ఇక ఈ వారం ప్రారంభం నుంచి ప్రిన్స్ యావర్‌కి తెగ క్లోజ్ అవుతోంది. ప్రస్తుతం రతిక, ప్రిన్స్ యావర్ మధ్య వ్యవహారం ముదిరి పాకాన పడుతోంది. అన్ని విషయాల్లోనూ వీరిద్దరూ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. కిచెన్‌లో చపాతీలు చేస్తున్న యావర్.. రతికను కూడా నీకు రోటి కావాలా అని అడగడం.. యావర్ టేబుల్ దగ్గర ఫుడ్ తింటుండగా.. రతిక వెళ్లి అతని పక్కన కూర్చోవడం వంటివి ఆసక్తికరంగా మారాయి.

హాట్ టాపిక్ అవుతున్న రతిక, యావర్

ఇక ప్రిన్స్ తన ప్లేట్‌లో నుంచి చపాతీ తుంచి ప్రేమగా రతికకు తినిపించాడు. తనకు స్త్రీలు అంటే గౌరవం ఉందని.. ఎప్పటికీ తప్పుగా ప్రవర్తించనని.. యావర్ చెప్పాడు. ఈ వ్యవహారమంతా చూసి షాక్ అవడం దామిని, గౌతమ్, శుభ శ్రీ వంతైంది. దీని గురించి ఈ ముగ్గురూ కాసేపు మాట్లాడుకున్నారు. రతిక మాయలో మళ్లీ యావర్ పడుతున్నాడని.. ఇక వీడి పని అయిపోయిందంటూ గౌతమ్ అన్నాడు. మొత్తానికి హౌస్‌లోనూ.. బయట వీరిద్దరూ తెగ హాట్ టాపిక్ అవుతున్నారు.

ఇవీ చదవండి:

త్రిష పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా?

ఆ సీన్ చేశాక పదే పదే ముఖం కడుక్కొన్నా: సదా

మళ్లీ పల్లవి ప్రశాంత్‌కు దగ్గరవుతున్న రతిక

హీరో నవదీప్ ఇంట్లో నార్కోటిక్ బ్యూరో సోదాలు

ఇవన్నీ ఏంటంటూ తల్లి సురేఖపై శ్రీజ ఫైర్..

నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోడట.. కానీ హీరోయిన్ తో రిలేషన్‌పై..

Google News