టాలీవుడ్‌కు గుడ్ బై చెప్పనున్న సమంత

Samantha Good Bye To Tollyw

స్టార్ హీరోయిన్ సమంత టాలీవుడ్‌కు దూరం కానుందట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. శాకుంతలం మూవీ డిజాస్టర్ తరువాత కొద్ది రోజుల క్రితం విడుదలైన ఖుషి సినిమా మంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా అటు ఇటీవలి కాలంలో హిట్సే లేని రౌడీ హీరో విజయ్ దేవరకొండ కెరీర్‌కు కూడా మంచి హైప్ ఇచ్చింది. అటు దర్శకుడు శివ నిర్వాణ కూడా ఈ సినిమా ప్లస్ అయ్యింది.

ఖుసి సినిమా తర్వాతే సమంత ఇక తెలుగులో సినిమాలు చేయకూడదని డిసైడ్ అయ్యిందట. దీనికి కారణం లేకపోలేదు. ఖుషి సినిమాతో సామ్ బాగా ట్రోల్ అయ్యింది. అసలే నాగచైతన్యతో పెళ్లి తర్వాత సమంత రెచ్చిపోతోందని.. అవసరానికి మించి ఎక్స్‌పోజింగ్ చేస్తోందని ఈ కారణంగానే గొడవలై వారిద్దరికీ విడాకులు అయ్యాయని టాక్ ఉంది. ఈ క్రమంలోనే విడాకుల తర్వాత కూడా సామ్ సీన్స్ కొన్ని ప్రేక్షకులకు నచ్చడం లేదు.

ఖుషి సినిమాలో ఓ సాంగ్‌లో భాగంగా విజయ్ దేవరకొండతో చేసిన రొమాన్స్‌పై తెలుగు ఆడియన్స్ పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. ఏ సినిమాలో అయినా సరే.. బోల్డ్ సీన్‌ లేదంటే ఎక్స్‌పోజింగ్ చేస్తే చాలు ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దీనికి కారణం ఆమె గతంలో అక్కినేని వారింటి కోడలవడమే. ఇక తాను ఏం చేసినా తెలుగు ప్రేక్షకులు తప్పుగా తీసుకుని ఇలాగే ట్రోల్ చేస్తుంటారని భావించిందో ఏమో కానీ సమంత టాలీవుడ్‌కు గుడ్ బై చెప్పనుందట. ఖుషి సినిమా తర్వాత టాలీవుడ్‌కి కాస్త గ్యాప్ ఇస్తున్నట్టు చెప్పిన సామ్.. హిందీలో మాత్రం ఒక సినిమాకు ఓకే చెప్పడంతో ఇక టాలీవుడ్‌కు గుడ్ బై చెప్పినట్టేనని భావిస్తున్నారు.

ఇవీ చదవండి:

Bigg Boss 7 Telugu: హాట్ టాపిక్ అవుతున్న రతిక, యావర్

త్రిష పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా?

ఆ సీన్ చేశాక పదే పదే ముఖం కడుక్కొన్నా: సదా

మళ్లీ పల్లవి ప్రశాంత్‌కు దగ్గరవుతున్న రతిక

హీరో నవదీప్ ఇంట్లో నార్కోటిక్ బ్యూరో సోదాలు

Google News