‘సలార్’ సంక్రాంతికి కూడా విడుదల కష్టమేనట..

‘సలార్’ సంక్రాంతికి కూడా విడుదల కష్టమేనట..

బాహుబలి మొదలు సలార్ సినిమా వరకూ ప్రభాస్‌ని ఓ సెంటిమెంట్ వెంటాడుతోంది. రిలీజ్ తేదీ వాయిదా పడటం. ఈ సినిమాల్లో ఏది కూడా ముందుగా ప్రకటించిన తేదీకి విడుదల కాలేదు. సలార్ మూవీని సెప్టెంబర్ 28న గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఈ సినిమా ఆ సమయానికి విడుదల కాదంటూ ఎప్పటి నుంచో ప్రచారం జరిగింది. అనుకున్నట్టుగానే సలార్ విడుదల వాయిదా పడింది. 

ఉన్నత ప్రమాణాలతో కూడిన మంచి సినిమా మీకు అందించేందుకు సలార్ రిలీజ్ ఆలస్యం అవుతోందని.. కొత్త తేదీ త్వరలో ప్రకటిస్తామని దర్శకుడు ప్రశాంత్ నీల్ వెల్లడించారు. అయితే ఆదిపురుష్ వీఎఫ్ఎక్స్ పట్ల వ్యతిరేకత రావడంతో ఈ విషయంలోనే ప్రశాంత్ నీల్ జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ వర్క్ ప్రశాంత్ నీల్‌కు నచ్చలేదట. ఈ కారణంగానే సినిమా విడుదల వాయిదా పడిందంటూ టాక్ నడుస్తోంది.

‘సలార్’ టీజర్ ఇంత ముందుగా ఎందుకు వదిలారు? కారణం ఏంటంటే..

అయితే తొలుత సలార్ మూవీ సంక్రాంతి బరిలో ఉంటుందంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడు సంక్రాంతి బరిలో కూడా అవకాశం లేదంటూ ప్రచారం ప్రారంభమైంది. ఇదే నిజమైతే నార్త్ ఇండియాలో కలెక్షన్స్‌కు స్వయంగా గండి కొట్టుకోవడమేనని టాక్ నడుస్తోంది. మొత్తానికి ఈ ఏడాది అయితే సలార్ విడుదల కాబోదని అంటున్నారు. ఈ మేరకు నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్‌కి సమాచారం ఇచ్చారట. 2024 సంక్రాంతి లేదా మార్చి నెలలో సలార్ థియేటర్స్‌లోకి వస్తుందని అంటున్నారు.

ఇవీ చదవండి:

టాలీవుడ్‌కు గుడ్ బై చెప్పనున్న సమంత

Bigg Boss 7 Telugu: హాట్ టాపిక్ అవుతున్న రతిక, యావర్

త్రిష పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా?

ఆ సీన్ చేశాక పదే పదే ముఖం కడుక్కొన్నా: సదా

మళ్లీ పల్లవి ప్రశాంత్‌కు దగ్గరవుతున్న రతిక

హీరో నవదీప్ ఇంట్లో నార్కోటిక్ బ్యూరో సోదాలు