Anasuya: 8 ఏళ్ల పాటు ఆయనతో సహజీవనం చేశానన్న అనసూయ..

8 ఏళ్ల పాటు ఆయనతో సహజీవనం చేశానన్న అనసూయ..

అనసూయ యాంకర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఇప్పుడు వెండితెరపై సత్తా చాటుతోంది. వరుస అవకాశాలతో దూసుకెళుతోంది. దాదాపు నాలుగు పదుల వయసులోననూ గ్లామర్‌తో రాణిస్తోంది. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోదు. ముఖ్యంగా ఎంత ఎక్స్‌పోజింగ్‌కి అయినా వెనుకాడదు. తాజాగా అనసూయ తన ప్రేమ, పెళ్లి గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 

పెళ్ళికి ముందు సుశాంక్ భరద్వాజ్‌తో ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 8 ఏళ్ల పాటు సహజీవనం చేసినట్లు అనసూయ వెల్లడించింది. ఇక్కడ ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే.. పెళ్లి అయ్యే వరకూ కూడా వారిద్దరికి ఒకరి కులం గురించి మరొకరికి తెలియదట. మరీ టూ మచ్ అనిపించినా ఇది నిజమట. పెళ్లి కుదిరాక కొన్ని కార్యక్రమాల్లో భాగంగా కులాలు తెలుసుకోవాల్సి వచ్చిందట. సుశాంక్ బిహార్‌కి చెందినవారట.

8 ఏళ్ల పాటు ఆయనతో సహజీవనం చేశానన్న అనసూయ..

ఇక అనసూయ మాటలు విన్న నెటిజన్లు ఇదంతా అస్సలు నమ్మశక్యంగా లేదని అన్నారు. పెళ్లి కుదిరాక కులం గురించి తెలుసుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. అనసూయ పక్కా బ్రాహ్మిన్. అలాంటిది వాళ్లింట్లో వాళ్లు భరద్వాజ్ కులం గురించి తెలుసుకోకుండానే వివాహానికి ఓకే చెబుతారా? అని ప్రశ్నిస్తున్నారు. అలాగే 8 ఏళ్ల పాటు ఒకరి కులం గురించి మరొకరు తెలుసుకోకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. అనసూయ చెప్పేదంతా అబద్ధమేనని కొట్టిపడేస్తున్నారు.

ఇవీ చదవండి:

‘సలార్’ సంక్రాంతికి కూడా విడుదల కష్టమేనట..

టాలీవుడ్‌కు గుడ్ బై చెప్పనున్న సమంత

Bigg Boss 7 Telugu: హాట్ టాపిక్ అవుతున్న రతిక, యావర్

త్రిష పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా?

ఆ సీన్ చేశాక పదే పదే ముఖం కడుక్కొన్నా: సదా

మళ్లీ పల్లవి ప్రశాంత్‌కు దగ్గరవుతున్న రతిక

Google News