Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ కాబోయేది ఎవరంటే ?

బిగ్‌బాస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ కాబోయేది ఎవరంటే..

బిగ్‌బాస్ సీజన్ 7 మూడో వారం కూడా ముగింపు దశకు చేరుకుంది. మూడో వారంలో నామినేషన్స్‌లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇప్పటికే దాదాపు ఎవరు ఎలిమినేట్ అవుతారనేది తేలిపోయింది. ఈ ఒక్కరోజు కూడా ఓటింగ్ ముగిస్తే పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ వారం నామినేషన్స్‌లో అమర్ దీప్, శుభశ్రీ, గౌతమ్ కృష్ణ, ప్రియాంక, రతికా రోజ్, ప్రిన్స్ యావర్, దామిని ఉన్నారు. 

ఈ ఏడుగురు కంటెస్టెంట్స్‌లో ఎవరు ఓటింగ్‌లో టాప్‌లో ఉన్నారు? ఎవరు లీస్ట్ ఉన్నారు? ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారు? అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఓటింగ్‌లో అమర్‌దీప్ ఓటింగ్‌లో టాప్‌లో ఉన్నాడు. అతనికి దాదాపు 31 శాతం ఓటింగ్‌ నమోదైంది. అమర్ తరువాత గౌతమ్ కృష్ణ ఉన్నాడు. ఆ తరువాత మూడో స్థానంలో ప్రిన్స్ యావర్ ఉన్నాడు. గౌతమ్‌కు ప్రిన్స్‌కు ఓటింగ్‌లో పెద్ద తేడా అయితే లేదు.

ఇక నాలుగు, ఐదు స్థానాల్లో శుభశ్రీ, రతికా రోజ్ ఉన్నారు. ప్రియాంక, దామిని చివరి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. అయితే గత రాత్రి టాస్క్‌లో భాగంగా ప్రియాంక తన హెయిర్ కట్ చేసుకుంది. కాబట్టి ఇవాళ ఆమెకు ఓటింగ్ బాగా పెరిగే అవకాశం ఉంది. ప్రియాంక బయటకు వెళ్లే అవకాశమే లేదు. దాదాపు ఈ వారం దామిని బయటకు వెళ్లే అవకాశమే ఎక్కువగా ఉంది. ఇక చూడాలి. ఈరోజు ఏం జరుగుతుందో. ఇవాళ టాస్కులతో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది పక్కాగా డిసైడ్ అయిపోయింది.

Google News