నేను ఎంజాయ్ చేస్తే నీకేంట్రా నొప్పి? : మంచు లక్ష్మి ఫైర్

నేను ఎంజాయ్ చేస్తే నీకేంట్రా నొప్పి? : మంచు లక్ష్మి ఫైర్

మంచు ఫ్యామిలీ ఏం చేసినా కూడా నెటిజన్లు ట్రోల్ చేస్తూనే ఉంటారు. ఒక్క మంచు మనోజ్ జోలికి మాత్రం పెద్దగా వెళ్లరు. ఇక మంచు లక్ష్మి, విష్ణు మాత్రం ఏం చేసినా కూడా బీభత్సంగా ట్రోల్ చేస్తుంటారు. అయితే మంచు లక్ష్మి వాటిపై ఎప్పుడూ రెస్పాండ్ అయ్యింది లేదు. కానీ తాజాగా ఏమనిపించిందో ఏమో కానీ ఆమె నెటిజన్లపై మండిపడ్డారు. తనకంటూ ఒక కెరీర్ ఉండకూడదా? అని నెటిజన్లను ప్రశ్నించారు. 

తాజాగా ఆమె ఎయిర్ పోర్టులో శుభ్రతను ట్విటర్ వేదికగా ప్రశ్నించింది. బిజినెస్ క్లాస్‌కి వెళ్లే దారిలో కార్పెట్స్ అపరిశుభ్రంగా ఉన్నాయని… వాటిని తన ఐ ఫోన్ బెటర్‌గా చూపిస్తుందన్నారు. రియాలిటీలో ఇంకా దారుణంగా ఉన్నాయంటూ అక్కడి పరిస్థితిని చూపిస్తూ వీడియో తీసి దానిని షేర్ చేసింది. అయితే ఎయిర్‌పోర్టులోని అపరిశుభ్రత ఆమె చెప్పిన విషయాలన్నంటినీ వదిలేసి కేవలం బిజినెస్ క్లాస్, ఐఫోన్‌ను మాత్రం జనాలు పట్టుకున్నారు.

‘నువ్వు బిజినెస్ క్లాస్ లో ప్రయాణం చేస్తున్నావ్, ఐఫోన్ వాడుతున్నావ్’ అని మాకు తెలియలనా ఈ ట్వీట్ అంటూ రకరకాలుగా మంచు లక్ష్మిని నెటిజన్లు ట్రోల్ చేశారు. దీంతో ఆమెకు విపరీతంగా కోపం వచ్చింది. తాను ఎంజాయ్ చేస్తే నీకేంట్రా నొప్పి అంటూ నెటిజన్‌పై మండిపడింది. ‘నువ్వేమైనా నాకు డబ్బులు ఇస్తున్నావా? నా కోసం ఖర్చు చేస్తున్నావా?’ అంటూ ఫైర్ అయ్యింది. తాను ఎంజాయ్ చేసే ప్రతి రూపాయిని తానే సంపాదించుకుంటున్నానని తెలిపింది. అమెరికాలో తిండికి ఇబ్బంది పడిన రోజులున్నాయని.. డబ్బు సంతోషాన్నివ్వదని.. కేవలం స్వేచ్ఛను మాత్రమే ఇస్తుందని మంచు లక్ష్మి వెల్లడించింది.

ఇవీ చదవండి:

ప్రిన్స్ యావర్‌కు మరోసారి అన్యాయం.. బీభత్సంగా పెరిగిపోతున్న సింపతి

Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ కాబోయేది ఎవరంటే ?

Anasuya: 8 ఏళ్ల పాటు ఆయనతో సహజీవనం చేశానన్న అనసూయ..

‘సలార్’ సంక్రాంతికి కూడా విడుదల కష్టమేనట..

టాలీవుడ్‌కు గుడ్ బై చెప్పనున్న సమంత

Bigg Boss 7 Telugu: హాట్ టాపిక్ అవుతున్న రతిక, యావర్

త్రిష పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా?