బిగ్‌బాస్ నుంచి వరుసబెట్టి అమ్మాయిలు అవుట్..

బిగ్‌బాస్ నుంచి వరుసబెట్టి అమ్మాయిలు అవుట్..

బిగ్‌బాస్ సీజన్ 7.. నాలుగో వారంలోకి అడుగు పెట్టింది. ఇక ఈ మూడు వారాలను పరిశీలిస్తే హౌస్ నుంచి వరుసబెట్టి అమ్మాయిలే అవుట్ అవుతూ వస్తున్నారు. తొలివారం కిరణ్ రాథోడ్ హౌస్ నుంచి నిష్క్రమించింది. తొలివారం కాస్త కన్ఫ్యూజన్.. పైగా కిరణ్ రాథోడ్ అసలు స్క్రీన్‌పై కనిపించిందే లేదు. కాబట్టి ఓట్లు పడలేదు.. ఆమె అవుట్.

ఇక రెండో వారం విషయానికి వస్తే.. షకీల అవుట్. నిజానికి షకీల హౌస్‌లోకి వెళ్లగానే ఆమెపై చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు నిర్వాహకులు. కానీ ఆమె చాలా కామ్‌గా తన జర్నీని నడిపించారు. టాస్కుల్లో పెర్ఫార్మెన్స్ నిల్. కంటెంట్ ఇచ్చింది కూడా పెద్దగా లేదు. దీంతో రెండో వారంలో షకీల నిష్క్రమించారు. ఇక మూడో వారం దామిని. ఆమె కూడా పెద్దగా టాస్కుల్లో పెర్ఫార్మెన్స్ ఏమీ లేదనే చెప్పాలి.

బిగ్‌బాస్ నుంచి వరుసబెట్టి అమ్మాయిలు అవుట్..

దామిని కాస్త యాటిట్యూడ్ చూపించడం.. యావర్ విషయంలో మరింత రూత్ లెస్‌గా వ్యవహరించడం వంటివి ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. ఓటింగ్‌లో చివరి స్థానంలో దామిని, శుభ్రశ్రీ ఉన్నారు. శుభశ్రీకి దామిని కంటే ఎక్కువ ఓట్లు దామినికి వచ్చాయి. దీంతో ఈ వారం ఇంటి నుంచి దామిని ఎలిమినేట్ అయ్యింది. ఈ క్రమంలోనే మూడో పవర్ అస్త్రాను శోభాశెట్టి కైవసం చేసుకుంది. దీంతో ఆమెకు మూడు వారాల ఇమ్యూనిటీ లభించింది.

ఇక ఈ వారం నామినేషన్‌లో అమర్ దీప్, రతిక, ప్రియాంక జైన్, గౌతమ్, యావర్, దామిని, శుభశ్రీ ఉన్నారు. అయితే అమర్ దీప్, రతిక, ప్రియాంక జైన్, గౌతమ్, యావర్‌‌లు ఇప్పటికే సేవ్ అవ్వగా.. చివరకు దామిని, శుభశ్రీ ఉన్నారు. అయితే వీరిలో శుభశ్రీకి దామిని కంటే ఎక్కువ ఓట్లు రావడంతో దామిని ఈవారం ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేట్ అయ్యిన దామినికి ఇప్పటి వరకు తాను సాధించిన టాస్క్‌లను చూపిస్తూ.. ఏమోషనల్‌గా ఆమెను బిగ్ బాస్ వేదికనుంచి నాగార్జున పంపించారు. ఇక రేపటి నుంచి నాలుగవ వారం నామినేషన్స్ జరుగనున్నాయి.

ఇవీ చదవండి:

నేను ఎంజాయ్ చేస్తే నీకేంట్రా నొప్పి? : మంచు లక్ష్మి ఫైర్

ప్రిన్స్ యావర్‌కు మరోసారి అన్యాయం.. బీభత్సంగా పెరిగిపోతున్న సింపతి

Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ కాబోయేది ఎవరంటే ?

Anasuya: 8 ఏళ్ల పాటు ఆయనతో సహజీవనం చేశానన్న అనసూయ..

‘సలార్’ సంక్రాంతికి కూడా విడుదల కష్టమేనట..

టాలీవుడ్‌కు గుడ్ బై చెప్పనున్న సమంత

Bigg Boss 7 Telugu: హాట్ టాపిక్ అవుతున్న రతిక, యావర్