వెంకటేష్‌తో సౌందర్య రిలేషన్‌లో ఉందంటూ రూమర్స్.. దానికి ఆమె ఎలా చెక్ పెట్టారంటే..

వెంకటేష్‌తో సౌందర్య రిలేషన్‌లో ఉందంటూ రూమర్స్.. దానికి ఆమె ఎలా చెక్ పెట్టారంటే..

విక్టరీ వెంకటేష్.. తొలినాళ్ల నుంచి కూడా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌తో మెప్పిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఆయన హిస్టరీలో సక్సెస్ రేటు చాలా ఎక్కువనే చెప్పాలి. మరీ ముఖ్యంగా అప్పట్లో సౌందర్యతో చేసిన సినిమాలన్నీ దాదాపు హిట్టే. పెళ్లి చేసుకుందాం, రాజా,ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, పవిత్ర బంధం,దేవి పుత్రుడు వంటి సినిమాలు వీరిద్దరి కాంబోలో వచ్చాయి. 

ఒక్క దేవీ పుత్రుడు మినహా మిగిలిన చిత్రాలన్నీ సూపర్ హిట్ సాధించాయి. ఆ సమయంలో వెంకటేష్.. సౌందర్యతో రిలేషన్‌లో ఉన్నారంటూ బీభత్సంగా టాక్ నడిచింది. తన భార్యకు విడాకులు ఇచ్చేసి సౌందర్యని పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ విషయంలో వెంకీ తండ్రి, ప్రొడ్యూసర్ రామానాయుడు ఎంటరై కొడుకు ఎంత చెప్పినా వినకపోయే సరికి సౌందర్య వైపు నుంచి నరుక్కొచ్చారట.

వెంకటేష్‌కి ఒక కుటుంబం ఉందని.. దానిని డిస్టర్బ్ చేయకని రామానాయుడు చెప్పడంతో సౌందర్య కూడా అర్థం చేసుకుని ఆయనను దూరం పెట్టారట. దేవీపుత్రుడు మూవీ తర్వాత వాళ్లిద్దరి కాంబోలో మరో చిత్రం రాకపోవడానికి కూడా ఇదే కారణమని టాక్. అయితే ఇంకా వీరిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని.. గట్టిగా చెప్పడానికి సౌందర్యతో వెంకీకి రామానాయుడే రాఖీ కూడా కట్టించేసి రూమర్స్‌కి ఫుల్ స్టాప్ పెట్టించారట.

ఇవీ చదవండి:

బిగ్‌బాస్ నుంచి వరుసబెట్టి అమ్మాయిలు అవుట్..

అయ్యో పాపం నరేష్.. పెళ్లి తెచ్చిన తిప్పలు..!

నేను ఎంజాయ్ చేస్తే నీకేంట్రా నొప్పి? : మంచు లక్ష్మి ఫైర్

ప్రిన్స్ యావర్‌కు మరోసారి అన్యాయం.. బీభత్సంగా పెరిగిపోతున్న సింపతి

Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ కాబోయేది ఎవరంటే ?

Anasuya: 8 ఏళ్ల పాటు ఆయనతో సహజీవనం చేశానన్న అనసూయ..

Google News