హమ్మయ్యా.. ప్రభాస్ కల్కి సినిమా సేఫ్..!

విడుదలకు ముందే కల్కి సరికొత్త రికార్డ్..

అవును.. మీరు వింటున్నది అక్షరాలా నిజమే..! పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సినీ జీవితంలో తొలిసారి ఇలా జరుగుతోంది. సోషల్ మీడియా యుగం ఇది. ఏ మాత్రం మీమర్స్, ట్రోలింగ్ బ్యాచ్ కు దొరికితే అంతే సంగతులు. ఇక ఎలాగో విమర్శకులు ఉండనే ఉంటారు. ప్రతిదీ పాయింట్ ఔట్ చేయడమే వాళ్ళ పని. వీళ్ళ చేతిలో పడితే ఎంతటి పెద్ద, చిన్న సినిమా అయినా అంతే సంగతులు.

ఇక అసలు విషయానికొస్తే.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్ తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలు రాలేదు.. ప్రభాస్ కు రేంజి తగ్గట్టుగా కథ దొరకలేదు. అందుకే ‘కల్కి’ సినిమాపై డార్లింగ్ తో పాటు, అభిమానులు సైతం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

మరికొన్ని గంటల్లో కల్కి మూవీ విడుదల కాబోతోంది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సైన్స్ ఫ్రిక్షన్ చిత్రంలో ప్రభాస్ భైరవగా నటిస్తున్నట్లు ఇప్పటికే తెలిసిపోయింది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఈసారి సినిమా విడుదలకు ముందే బ్లాక్ బస్టర్ హిట్టయినట్లుగా ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్న పరిస్థితి. ఎందుకంటే.. ఈసారి సోషల్ మీడియాలో ఎక్కడా నెగిటివ్ టాక్ కానీ, నెగిటివ్ పబ్లిసిటీ రాలేదు. మీమ్స్ బ్యాచ్ ను మేనేజ్ చేసిందో లేకుంటే మరో అద్భుతం ఏదైనా జరిగిందో తెలియట్లేదు.. కానీ నెగిటివ్ ఐతే ఎక్కడా కనిపించక, వినిపించకపోవడం మంచి పరిణామమే అని చెప్పుకోవచ్చు.

రాధేశ్యామ్, సాహో, సలార్ సినిమాల విషయంలో బాబోయ్ ఎంత నెగిటివిటీ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. దీంతో క్రిటిక్స్ ఒక రేంజిలో రెచ్చిపోయారు. పైగా ఈ మూడు సినిమాల్లో కూడా కొన్ని కొన్ని సన్నివేశాలు చిత్ర విచిత్రంగా ఉన్నాయ్. దీంతో ఆశించినంత స్థాయిలో ఆడలేదు. మరీ ముఖ్యంగా గ్రాఫిక్స్, మేకప్.. డైలాగ్స్ విషయంలో దారుణాతి దారుణంగా ట్రోల్స్ వచ్చి పడ్డాయి. ఐతే కల్కి విషయంలో ఇవన్నీ ఏమీ లేవు. మేకర్స్ చాలా జాగ్రత్తగా మేకింగ్ మొదలుకుని ప్రమోషన్స్.. రిలీజ్ వరకూ ఆచి తూచి అడుగులు వేసినట్టుగా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇలా సినిమా రిలీజ్ అవ్వడం తెలుగు ఇండస్ట్రీలోనే తొలిసారి. ఏదైతేనేం ప్రభాస్ కల్కి సేఫ్ అన్న మాట. మరి ఇది ప్రభాస్ సినీ జీవితంలో ఏ మాత్రం బిగ్గెస్ట్ హిట్టు మూవీగా నిలుస్తుంది..? ప్రభాస్ ఫ్యాన్స్ కలలు ఏమాత్రం సాకారం అవుతాయో తెలియాలంటే మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.