వామ్మో.. సల్మాన్ వాచ్ ఖరీదు అన్ని కోట్లా?

వామ్మో.. సల్మాన్ వాచ్ ఖరీదు అన్ని కోట్లా?

సినిమా ఇండస్ట్రీలో లగ్జరీకి మొదట ప్రాధాన్యం ఇస్తుంటారు. వాళ్లు ధరించే చెప్పుల నుంచి వేసుకుని తిరిగే కార్ల వరకూ అన్ని విషయాల్లోనూ లగ్జరీ చూస్తుంటారు. లగ్జరీగా కనిపించడం కోసం ఎంత ఖర్చు చేసేందుకైనా వెనుకాడరు. ఇక హీరోయిన్స్ అయితే మరీనూ. లిప్‌స్టిక్ కూడా ఖరీదైనదే వాడుతుంటారు. ఇక హ్యాండ్ బ్యాగ్‌కి భారీగా ఖర్చు పెడుతుంటారు. ఇక బాలీవుడ్ స్టార్స్ అయితే మరింత లగ్జరీ లైఫ్ మెయిన్‌టైన్ చేస్తుంటారు.

బాలీవుడ్ స్టార్ హీరో.. కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి అందరికీ తెలిసిందే. లగ్జరీకి ఆయన పెద్ద పీట వేస్తుంటారు. ఇక తాజాగా సల్మాన్ ఒక వాచ్ ధరించి కనిపించాడు. దాని ధర ఎంతో తెలిస్తే షాక్ అవడం ఖాయం. వాచ్ అంటే దాని ఖరీదు వెయ్యో.. రెండు వేలో ఉంటుంది అనుకుంటాం. మనం కొనుక్కునేదైతే అంతే ఉంటుంది మరి. ఇక సెలబ్రిటీలు అది కూడా స్టార్ హీరోల విషయానికి వస్తే లక్షల్లో ఉంటుంది అనుకుంటాం.

కానీ సల్మాన్ ఖాన్ తాజాగా ఓ వాచ్ ధరించి కనిపించాడు. దాని కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవడం ఖాయం. సల్మాన్ ఖాన్ తన సోదరి అర్పితా ఖాన్ నివాసంలో దీపావళి వేడుకలకు హాజరయ్యారు. ఆ సమయంలో ఆయన చేతి వాచ్‌పై కెమెరా కళ్లు పడ్డాయి. ఆయన వాచ్‌ను తరచి చూసిన ఫ్యాన్స్ అసలు ఆ వాచ్ ఎంత ఉంటుందనే వివరాలు బయటకు తీశారు. టైమ్ పీస్ రోలెక్స్ స్కై డ్వెల్లర్ మోటో రైట్ వాచ్ అట అది. దాని ఖరీదు రూ.2.9 కోట్లు. వజ్రాలు పొదిగిన వాచ్ కావడంతో అంత కాస్ట్ అవుతోందట. వాచ్ కాస్ట్ తెలిసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.