తూర్పుగోదావరి జిల్లాలో 10 సీట్లు ఫిక్స్.. జనసేనకు ఎన్నంటే..

తూర్పుగోదావరి జిల్లాలో 10 సీట్లు ఫిక్స్.. జనసేనకు ఎన్నంటే..

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన సీట్ల పంపకం విషయంలో దాదాపు స్పష్టత వచ్చింది. ఈ జిల్లాలో మొత్తంగా 19 నియోజకవర్గాలున్నాయి. వీటిలో ఆరు మినహా మిగిలిన అన్నింటిపైనా స్పష్టత వచ్చింది. ప్రస్తుతానికైతే టీడీపీకి పది స్థానాలు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ పదిమందిలో బడా నేతల వారసులు కూడా ఉన్నారు. రాజమండ్రి అర్బన్‌లో ఆదిరెడ్డి కుటుంబానికి టికెట్ లభించింది. అయితే ఎవరికనే విషయంలో స్పష్టత రాలేదు.

ఇక తుని నుంచి సీనియర్ నేత యనమల రామకృష్ణుడి కుమార్తె దివ్య బరిలోకి దిగనున్నారు. మూడు సీట్లను జనసేనకు కేటాయించినట్టుగా తెలుస్తోంది. వాటిలో కాకినాడ రూరల్‌, రాజానగరం, రాజోలు సీట్లను పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించినట్టు సమాచారం. ఇవి కాకుండా జనసేన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మరో రెండు సీట్లను ఆశిస్తోందని తెలుస్తోంది. వాటిలో పిఠాపురం కూడా ఉంది. అయితే పిఠాపురంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ బలమైన అభ్యర్థిగా ఉండటంతో పార్టీ అధిష్టానం ఆలోచనలో పడింది.

ఖరారైన పది మంది అభ్యర్థులు..

దివ్య-తుని,

వరుపుల సత్యప్రభ-ప్రత్తిపాడు

నిమ్మకాయల చినరాజప్ప-పెద్దాపురం

నల్లమిల్లి రామకృష్టారెడ్డి-అనపర్తి

దాట్ల సుబ్బరాజు, బండారు సత్యానందరావు-కొత్తపేట

వేగుళ్ల జోగేశ్వరరావు-మండపేట

గోరంట్ల బుచ్చయ్య చౌదరి- రాజమండ్రి రూరల్‌

జ్యోతుల నెహ్రూ-జగ్గంపేట..

రాజమండ్రి అర్భన్ – ఆదిరెడ్డి కుటుంబానికే ఎర్రన్నాయుడి కూతురా? లేదంటే కొడుకా? అనే విషయంలో స్పష్టత రాలేదు.

Google News