Skoch Ratings: ఎవరెన్ని అన్నా.. సుపరిపాలనలో జగనన్నే ది బెస్ట్..
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనపై విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా.. జనం వాటిని పట్టించుకోవడమే మానేశారు. ఇక ఇప్పుడు జగనన్న పాలనకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. సుపరిపాలనలో జగన్ దేశంలోనే మూడవ స్థానంలో నిలిచి ది బెస్ట్ అనిపించుకున్నారు. ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వమూ చేపట్టని రీతిలో ఆంధ్రప్రదేశ్‌లోజగన్ పాలన సంస్కరణలు చేపట్టారు. అంతే కాదు.. ప్రభుత్వాన్ని ప్రజల చెంతకు చేర్చిన ఘనత కూడా ఆయనదే. అందుకే జగన్ ప్రభుత్వానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది.
గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణం, రెవెన్యూ శాఖలకు అరుదైన గౌరవం..
ప్రతి గ్రామంలోనూ ఓ సచివాలయం.. వలంటీర్ వ్యవస్థను చేపట్టారు. వలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే రేషన్, పెన్షన్ వంటి వాటన్నింటినీ చేరేలా చూశారు. తద్వారా జగన్ ప్రతి ఇంటికి ఆత్మబంధువులా మారిపోయారు. ఇలాంటి అత్యుత్తమ సంస్కరణలను ప్రవేశ పెట్టిన ఆంధ్రప్రదేశ్.. దేశానికే ఆదర్శంగా నిలిచింది. ముఖ్యంగా ఏపీ గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణం, రెవెన్యూ శాఖలకు అరుదైన గౌరవం దక్కింది. పరిపాలనలో అత్యుత్తమ విధానాలను అవలంభిస్తున్న రాష్ట్రంగా ప్రతిష్టాత్మక ”స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్ట్-2023”లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 3వ స్థానంలో నిలిచింది. గతేడాది నాలుగవ స్థానంలో ఏపీ ఉండగా.. ఇప్పుడు ఓ స్థానాన్ని మెరుగుపరుచుకుంది.
దక్షిణాదిలో ఏపీ మాత్రమే..
ఏపీలో జగన్ ప్రజా సంక్షేమం కోసం వైఎస్ జగన్ అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలు, విప్లవాత్మకమైన సంస్కరణల ఫలితాలు జాతీయ స్థాయిలో గుర్తింపపు పొందాయి. అందుకే ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖకు అంతటి అరుదైన గౌరవం అభించింది. ముఖ్యంగా ప్రజల చెంతకే పాలనను తీసుకెళ్లడం.. పాలనను అత్యంత పారదర్శకంగా కొనసాగించడం వంటి జగన్ తీసుకున్న అద్భుతమైన కారణాలతో ఏపీ గ్రామీణాభివృద్ధిలో విజయవంతమైన ఫలితాలను సాధించింది. ఆసక్తికర విషయం ఏంటంటే.. స్కోచ్ సంస్థ నిర్వహించిన సర్వేలో దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ ఒక్కటే తొలి ఐదు స్థానాల్లో నిలిచి రికార్డ్ క్రియేట్ చేసింది. మొదటి స్థానంలో ఒడిశా, రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్, మూడో స్థానంలో ఏపీ, నాలుగో స్థానంలో మహారాష్ట్ర, ఐదో స్థానంలో గుజరాత్ నిలిచాయి.