బీజేపీ ఇక రెడ్డిలదే..

Telangana BJP: కర్ణాటక ఫలితాల తర్వాత టీబీజేపీలో మార్పు.. పూటకో స్టేట్‌మెంట్ ఇస్తున్న నేతలు..!

నిన్న మొన్నటి వరకూ ఒక లెక్క.. ఇప్పుడో లెక్క అంటోంది బీజేపీ. అసెంబ్లీ ఎన్నికలకు.. సార్వత్రిక ఎన్నికలకు నడుమ వ్యత్యాసం చూపిస్తోంది. అంటే… అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీసీ స్లోగన్ అందుకుంది. కానీ ఇప్పుడు రెడ్డిలకే టికెట్లు అంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు వెల్లడించారు.

అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం ఎదురవడంతో ఆ పార్టీ పెద్దలు రూటు మార్చేశారు. ఈసారి లోక్‌సభ టికెట్‌లన్నీ అగ్రవర్ణాల అభ్యర్థులకే కేటాయించాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ను మార్చేసి కిషన్ రెడ్డికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. ఆ సమయంలో సొంత పార్టీ నేతలు సైతం అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

ఎంతమంది నేతలు పార్టీని వీడుతున్నా కిషన్ రెడ్డి పట్టించుకోలేదు. పర్యవసానంగా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైంది. దీంతో బీసీలకు అధిక సీట్లు కేటాయించడం వలన దారుణంగా విఫలమయ్యామని.. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో బీసీలకు కాకుండా రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు కేటాయించాలని బీజేపీ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలే ఎక్కవగా విజయం సాధించడం కూడా దీనికి ఒక కారణం.