ఇదీ.. ఇదే సార్ జగన్ బ్రాండ్.. ఎన్నికల ముందు వెయ్యి కోట్ల పెట్టుబడి!

ఇదీ.. ఇదే సార్ జగన్ బ్రాండ్.. ఎన్నికల ముందు వెయ్యి కోట్ల పెట్టుబడి!

ఎన్నికల ముందు కూడానా.. ఇది ముమ్మాటికీ జగన్‌ ఘనతే..!

ఒక్క కంపెనీ లేదు.. జగన్ చేసిందేమీ లేదు.. పెట్టుబడులు లేవు నిద్ర లేచింది మొదలుకుని.. నిద్రపోయే వరకూ ప్రతిపక్షాలు ఒక్కటే ఊదరగొట్టుడు. ఇదిగో ఇన్ని కంపెనీలు వచ్చాయి.. అభివృద్ది ఇదని చూపించినా అవేం కనిపించవు అన్నట్లుగా గుడ్డిగా ప్రతిపక్ష నేతలు బతికేస్తున్నారు. ఎంతసేపూ కియా లాంటివి వచ్చాయా..? ఇలానే పిచ్చి ప్రశ్నలేస్తున్న ప్రతిపక్షాల గూబ గుయ్యిమనేలా ఏపీలో వెయ్యి కోట్లు పెట్టబడితో పేరుగాంచిన కంపెనీ వచ్చేసింది. ఇదంతా ఎన్నికల ముందు జరగడం వైసీపీకి మరింత కిక్కెక్కించే పరిణామమేనని చెప్పుకోవచ్చు. ఇంతకీ ఆ కంపెనీ ఏంటి..? ఎక్కడ నిర్మిస్తున్నారనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి మరి..!

Advertisement

ఇదీ అసలు సంగతి!

భారతదేశంలో అగ్రి సొల్యూషన్స్ ప్రొవైడర్ అయిన కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ రూ.1000 కోట్ల పెట్టుబడితో ఏపీలోని కాకినాడలో ఫాస్ఫారిక్ -సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. దీనికోసం ఇప్పటికే పనులను ప్రారంభించింది. ఏప్రిల్ 26న ఏర్పాటు చేసిన శంకుస్థాపన కార్యక్రమానికి కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, అరుణ్ అలగప్పన్, హాజరయ్యారు. న్యూట్రియంట్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఎస్. శంకర సుబ్రమణియన్, గ్లోబల్ టెక్నాలజీ భాగస్వాములతో కీలక ఒప్పందాలపై సంతకం చేశారు. రూ. 1000 కోట్ల అంచనా వ్యయంతో, ప్రాజెక్ట్ రెండేళ్లలో పూర్తవుతుందని కోరమాండల్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ అరుణ్‌ అలగప్పన్‌ వెల్లడించారు. రోజుకు 650 టన్నుల తయారీ సామర్థ్యంతో ఫాస్ఫరిక్‌ యాసిడ్‌ ఉత్పత్తి కేంద్రం.. రోజుకు 1,800 టన్నుల సామర్థ్యంగల సల్ఫరిక్‌ యాసిడ్‌ ప్లాంటు ఏర్పాటు కానున్నాయి.

ఇదీ.. ఇదే సార్ జగన్ బ్రాండ్.. ఎన్నికల ముందు వెయ్యి కోట్ల పెట్టుబడి!

ఇదీ జగన్ రేంజ్!

ఇప్పటి వరకూ ఈ కంపెనీ ఏర్పాటు చేసిన ప్లాంట్‌లలో కాకినాడలో నిర్మిస్తున్నది దేశంలో రెండవ అతిపెద్దది కావడం విశేషం. ఈ ప్లాంట్ సామర్థ్యం 20 లక్షల టన్నులు కాగా.. దేశవ్యాప్తంగా తయారవుతున్న నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం ఆధారిత ఎరువుల పరిమాణంలో కోరమాండల్‌ కాకినాడ ప్లాంటు వాటా 15 శాతం ఉంది. మొత్తానికి.. ఇదంతా వైసీపీ సాధించిన ఘనతే. దీని ద్వారా ఎందరో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడం జరుగుతుంది. ప్రభుత్వం ఇప్పటికే ఏపీ ప్రజానీకం కోసం ఎన్నో కార్యక్రమాలను చేపట్టింది. ప్రస్తుతం ఉద్యోగ కల్పన కోసం కూడా ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల ముందు కూడా ప్రజల కోసం ఆలోచన చేయడం హర్షించదగిన పరిణామం. ఇలాంటి తరుణంలో ఎలా ఓట్లను రాబట్టుకుందామా? అని మాత్రమే ప్రభుత్వాలు చూస్తాయి. కానీ ఏపీ సీఎం జగన్ మాత్రం పెట్టుబడుల గురించి కూడా ఆలోచిస్తుండటం విశేషం.