ALN Survey: వార్ వన్ సైడ్.. 149 సీట్లతో ఫ్యాన్ ప్రభంజనం

aln survey ap elections 2024

ఏపీలో విజయం ఎవరిది? అని ప్రశ్నించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే పరిస్థితులన్నీ అక్కడ వైసీపీకి ఫేవర్‌గా మారిపోయాయి. వార్ వన్ సైడ్ అయిపోయింది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకుపోతున్నా సరే.. ప్రజలు మాత్రం అధికార పార్టీకే బ్రహ్మరథం పడుతున్నారు. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్రతో కాస్తో కూస్తో ఉన్న వ్యతిరేకత కూడా పోయింది. మొత్తం సానుకూల వాతావరణమే. ఎటు చూసినా ప్రజలు వైసీపీదే విజయం అంటున్నారు.

వారెవ్వా వైసీపీ!

తాజాగా ఆంధ్ర లైవ్ న్యూస్ అనే మీడియా సంస్థ ఏపీ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారనే విషయమై సర్వే నిర్వహించింది. ఈ సర్వేలోనూ వైసీపీయే విజయం సాధిస్తుందని తేలింది. నియోజకవర్గానికి 550 మంది చొప్పున విచారించి ఈ సర్వే నిర్వహించడం జరిగిందని ఏఎల్ఎన్ సంస్థ తెలిపింది. ఈ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం ఏపీ ఎన్నికల్లో వైసీపీ 149 స్థానాల్లో విజయం సాధిస్తుందని తేలింది. ఇక టీడీపీ కేవలం 26 స్థానాలకు పరిమితమవుతోందని తేల్చేసింది. అంటే గత ఎన్నికలతో పోలిస్తే కేవలం మూడంటే మూడు సీట్లను మాత్రమే పెంచుకోగలిగిందన్న మాట. అది కూడా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, పదేళ్లు ప్రధానిగా పనిచేసిన మోదీ చరీష్మా, బీజేపీ.. అంతా నేనే అని చించుకోనే పవన్ కల్యాణ్ జనసేన పార్టీ మూడూ కలిసినా 26 సీట్లే వస్తాయని సర్వేలో తేలిందంటే.. ఇక మాటల్లో చెప్పక్కర్లేదు.

aln survey ap elections 2024

మెజార్టీ లెక్కలివీ..!

ఇక వైసీపీ 51 శాతం ఓట్లను కైవసం చేసుకుంటుందని.. టీడీపీ కూటమి 41 శాతం.. ఇండియా కూటమి 4 శాతం ఓట్లను కైవసం చేసుకోనుంది. వైసీపీ మెజారిటీ విషయానికి వస్తే.. 79 స్థానాల్లో పది వేల పైన మెజారిటీ వచ్చే అవకాశం ఉందట. అలాగే వైసీపీకి 5 నుంచి 10 వేల మెజారిటీ 57 స్థానాల్లో వస్తుంది. ఇక ఐదు వేల లోపు 13 స్థానాల్లో మెజారిటీ వస్తుందని ఆంధ్ర లైవ్ న్యూస్ సంస్థ తెలిపింది. మొత్తానికి ఈసారి ఎన్నికల్లో వైసీపీదే ఘన విజయమని తేల్చింది. అయితే.. కుప్పం నుంచి చంద్రబాబు, హిందూపురం నుంచి బాలయ్య గెలవబోతున్నారు. అయితే.. రాయలసీమ పలుచోట్ల వైసీపీ అభ్యర్థులు మార్పు, కొందరు పార్టీ మార్పుతో రెండు, మూడు స్థానాలు కూటమి ఖాతాలో పడ్డాయి. ఇక కోస్తా, ఉత్తరాంధ్రలోనూ ఇదే పరిస్థితి. ఇక విజయవాడ, గుంటూరు జిల్లాల్లో అయితే.. ఏకంగా మంత్రులు ఇదివరకూ ఏలిన నియోజకవర్గాల్లో టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి.

aln survey ap elections 2024

కూటమి గెలిచే స్థానాలివే..!

టెక్కలి
బొబ్బిలి
శృంగవరపుకోట
గాజువాక
పెద్దాపురం
ముమ్మిడివరం
రాజోలు
మండపేట
రాజమండ్రి సిటీ
పాలకొల్లు
ఉండి
తణుకు
పెనమలూరు
విజయవాడ సెంట్రల్
విజయవాడ ఈస్ట్
తాడికొండ
రేపల్లె
ప్రత్తిపాడు
గుంటూరు వెస్ట్
చిలకలూరిపేట
సంతనూతలపాడు
రాయదుర్గం
మడకశిర
హిందూపురం
పెనుకొండ
కుప్పం.