యుద్ధంలో గెలుపెవరిది..?

యుద్ధంలో గెలుపెవరిది..?

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. 58 నెలల క్రితం జగన్ విడుదల చేసిన మేనిఫెస్టోలో 99 శాతం పూర్తి చేశారు. ఇప్పుడు కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. దానిలో లేనిపోని ఆర్భాటాలేమీ లేవు. పెద్ద ఎత్తున హామీలూ లేవు. ఉన్న వాటికి కొనసాగింపు.. కాస్త హైప్ ఉంది. అయితే మేనిఫెస్టోపై జనాలు ఏమనుకుంటున్నారు. అసలు ఇది వైసీపీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా..? అనేవి చూద్దాం. 

గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ జగన్ దాదాపుగా నెరవేర్చారు కాబట్టి జనాల్లో ఇప్పుడిచ్చిన హామీలను నెరవేరుస్తారా? లేదా? అనే సందేహమైతే లేదు. అయితే ఏపీ ప్రజానీకం ముఖ్యంగా రైతులు ఈసారి మేనిఫెస్టోలో తప్పక రైతు రుణమాఫీ ఉంటుందని భావించారు. అయితే అది లేదు. కానీ రైతు భరోసాలో పెంపు ఉంది. మరి అది కలిసొస్తుందా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఎప్పటికప్పుడు రైతు భరోసా సరైన సమయానికి రైతుల అకౌంట్‌లలో పడింది కాబట్టి రైతు భరోసాను జనం పాజిటివ్‌గానే తీసుకుంటున్నారు. 

ఈ అంశం రుణమాఫీ లేదనే నిరాశ అంతో ఇంతో ఉన్నా కూడా రైతు భరోసాలో పెంపుదల ఉంది కాబట్టి ఇబ్బంది అయితే లేదు. ఇక్కడ మరో చిక్కు కూడా ఉంది. ఇక డ్వాకా రుణమాఫీ లేదు.. మహిళలకు చేయూత మాత్రం పెంచారు. అబద్ధాలు, పెద్ద ఎత్తున హామీల జోలికైతే జగన్ వెళ్లలేదు. ఇవి మాత్రమే చేస్తానంటూ పక్కాగా జగన్ చెబుతున్నారు. టీడీపీ పూర్తి స్థాయి మేనిఫెస్టోను ఇప్పటి వరకూ విడుదల చేయలేదు. ఆల్ ఫ్రీ అని సూపర్ సిక్స్ ప్రకటించారు. రేపో మాపో టీడీపీ మేనిఫెస్టో కూడా వచ్చేస్తుంది. ఇంతకు మించిన హామీలను టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించే అవకాశం లేకపోలేదు. మరి జనాలు ఎవరిని నమ్ముతారు? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

Google News