15 లక్షల మందితో జనసంద్రంగా సిద్ధం సభ.. జగన్ పంచ్‌లే పంచులు..

15 లక్షల జనాలు… అద్దంకి సిద్ధం సభ గ్రాండ్ సక్సెస్

ఇవాళ ఏపీ సీఎం నిర్వహించిన అద్దంకి మేదరమెట్ల సిద్ధం సభ జనసంద్రంగా మారింది. 15 లక్షల మంది హాజరై సభను గ్రాండ్ సక్సెస్ చేశారు. సభా వేదిక సాక్షిగా జగన్ తమ పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనలను టార్గెట్ చేస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు. పంచ్‌ల మీద పంచ్‌లు వేస్తుంటే సభ జనాల కేకలు, కేరింతలతో దద్దరిల్లిపోయింది. ఆంధ్రప్రదేశ్‌కు హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా ఏమైందని ప్రధాని మోదీని జగన్ సూటిగా ప్రశ్నించారు.

15 లక్షల జనాలు… అద్దంకి సిద్ధం సభ గ్రాండ్ సక్సెస్

సైకిల్‌కు టైర్లు.. ట్యూబ్‌‌లు లేవ్..

తన వెనుక ఆకాశంలో నక్షత్రాలు ఎన్నున్నాయో అంతమంది స్టార్ క్యాంపెయినర్లు ప్రతి ఇంట్లో ఉన్నారని.. తానేమీ ఒంటరిని కానని జగన్ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలది కృష్ణుడి పాత్ర అని.. తనది అర్జనుడి పాత్ర అని తెలిపారు. ఇది ధర్మాధర్మాల మధ్య జరిగే యుద్ధమన్నారు. ఈ సందర్భంగా టీడీపీపై సెటైర్లు గుప్పించారు. సైకిల్ తుప్పు పట్టిపోయిందని.. అసలు సైకిల్‌కు టైర్లు.. ట్యూబ్‌‌లే లేవని.. అలాంటి తుప్పు పట్టిన సైకిల్‌ను తోయడానికి ఇతర పార్టీలు కావాలన్నారు. పక్క రాష్ట్రాల నుంచి కొన్ని హామీలను తీసుకొచ్చి చంద్రబాబు కిచిడి చేశారన్నారు. శకుని చేతిలోని పాచికలు.. బాబు వాగ్దానాలు ఒకటేనని జగన్ అన్నారు. ఫ్యాన్ ఇంట్లో ఉండాలని.. సైకిల్ ఇంటి బయట ఉండాలని.. తాగేసిన టీ గ్లాస్ సింకులోనే ఉండాలన్నారు.

15 లక్షల జనాలు… అద్దంకి సిద్ధం సభ గ్రాండ్ సక్సెస్

సిద్ధమంటే ప్రజలు చేసే యుద్ధం..

సైకిల్‌ చక్రం తిరగక.. ఢిల్లీ  చుట్టూ పొర్లు దండాలు పెడుతున్నాడని చంద్రబాబుపై జగన్ సెటైర్లు గుప్పించారు. చిత్తశుద్ధితో మనం చేసిన మంచే చంద్రబాబును పొత్తుల వైపు పరుగులు పెట్టేలా చేసిందన్నారు. విరగ గాసిన మామిడి చెట్టులా మనముంటే.. తెగులు పట్టిన చెట్టులా చంద్రబాబు పరిస్థితి ఉందన్నారు. పార్టీల పొత్తులతో చంద్రబాబు ముందుకెళుతుంటే.. ప్రజలే బలంగా మనం ముందుకెళుతున్నామని జగన్ పేర్కొన్నారు. మహాసంగ్రామానికి తలపడబోతున్నామని దానికి మీరంతా సిద్ధమా..? అని ప్రశ్నించారు. మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకోవాడానికి సిద్ధంగా ఉండాలన్నారు. సిద్ధమంటే ప్రజలు చేసే యుద్ధమని.. ప్రజా సముద్రమన్నారు. ఇప్పటికే అటు ఉత్తరాంధ్ర.. ఇటు కోస్తాంధ్ర.. మరోవైపు రాయలసీమ.. ఇంకోవైపు దక్షిణ కోస్తా సిద్ధమన్నారు. నాలుగు రోజుల్లోపే ఎన్నికల నోటిఫికేషన్ రానుందని జగన్ తెలిపారు. 

Google News