విశాఖ తీరంలో పట్టుబడిన 25 వేల కేజీల డ్రగ్స్‌.. టీడీపీ నేతలే సూత్రధారులని పోలీసుల గుర్తింపు

విశాఖ తీరంలో పట్టుబడిన 25 వేల కేజీల డ్రగ్స్‌.. టీడీపీ నేతలే సూత్రధారులు..!

విశాఖ తీరంలో ఒకటి కాదు… రెండు కాదు.. 25 వేల కేజీల డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ డ్రగ్స్ స్కాంలో టీడీపీ నేతలకు నేరుగా లింకులు ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. టీడీపీ నేతలు దామచర్ల సత్య, లావు శ్రీ కృష్ణ దేవరాయలు, రాయపాటి జీవన్ లతో నిందితుడు కోటయ్య చౌదరికి దగ్గర సంబంధాలున్నట్టు పోలీసులు గుర్తించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకి దామచర్ల సత్య అత్యంత ఆప్తుడు.

అంతేకాదు.. ఈ కేసులో చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు నేరుగా సంబంధం ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అందుకే ముందే ఉలిక్కిపడి వరుసగా చంద్రబాబు, నారా లోకేష్ ట్వీట్లు వేసినట్టు సమాచారం. ‘‘ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని డ్రగ్స్ రాజధానిగా మార్చింది. డ్రగ్స్ స్వాధీనంలో ఏపీ పోలీసులు, పోర్టు అధికారులు సహకరించకపోవడంపై అధికార పార్టీ హస్తం ఉండొచ్చు. ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ రాష్ట్రంలోకి రావడంపై విచారణ జరగాలి’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

Advertisement
విశాఖ తీరంలో పట్టుబడిన 25 వేల కేజీల డ్రగ్స్‌.. టీడీపీ నేతలే సూత్రధారులు..!

మొత్తానికి తీగ లాగితే డొంక కదిలినట్లు ఈ వ్యవహారంలో టీడీపీ అధినేత కుటుంబం పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అంతేకాకుండా.. నందమూరి, దగ్గుపాటి కుటుంబం పేరు కూడా బాగానే వినిపిస్తోంది. సంధ్య ఆక్వా కంపెనీ అనేది దగ్గుబాటి పురందేశ్వరి కుమారుడు, ఆమె సమీప బంధువైన ప్రసాదరావు కలిసి ఏర్పాటు చేశారు. దీనికి తోడు లోకేష్ తోడల్లుడు, నందమూరి బాలకృష్ణ చిన్న అల్లుడు గీతం భరత్ కుటుంబంతోను వీరభద్రరావు కు సన్నిహిత సంబంధాలున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. మొత్తానికి ఈ వ్యవహారం టీడీపీ నేతల మెడకు కాస్త గట్టిగానే చుట్టుకుంటోంది.