చంద్రబాబుకు బదులు జగన్ అని పలికిన ఆలపాటి రాజా.. అయిపాయ్..

చంద్రబాబుకు బదులు జగన్ అని పలికిన ఆలపాటి రాజా.. అయిపాయ్..

కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అన్నారో కవి. అలా అయితే పొరపాటు లేదేమో కానీ పేర్లు తారుమారైతే మాత్రం పొరపాటే. రాజకీయాల్లో మాత్రం మరింత ఇబ్బందికరంగా మారుతుంది. తాజాగా టీడీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడిన మాట నెట్టింట రచ్చ లేపుతోంది. మాజీ మంత్రి రాజా ప్రస్తుతం తెనాలి టికెట్ ఆశిస్తున్నారు. ఎప్పటి నుంచో ఆయన టీడీపీకి అండదండగా ఉన్నారు. అలాంటి వ్యక్తికి పొరపాటున టంగ్ స్లిప్ అయ్యింది.

తాజాగా గుంటూరు జిల్లాలో చంద్రబాబు రా.. కదలిరా బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ఆలపాటి రాజా చాలా ఆవేశంగా మాట్లాడారు. ఈ క్రమంలోనే చంద్రబాబు పేరు పలకడానికి బదులు జగన్ పేరు పలికారు. అయిపాయ్.. తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకున్నారు. వైసీపీ సర్కారు మీద తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించే సమయంలో ఆవేశంలో జరిగిన పొరపాటే కానీ ఆయన మాటల క్రెడిట్ ప్రత్యర్థికి చేరిపోయింది. మొత్తానికి రాజా నవ్వుల పాలయ్యారు.

కాగా.. ఆలపాటి రాజా తెనాలి నుంచి పోటీ చేయాలని భావిస్తుండగా.. పొత్తులో భాగంగా ఆ స్థానం జనసేనకు పోయేలా ఉందని టాక్. జనసేనలో నంబర్ 2గా ఉన్న నాదెండ్ల మనోహర్ తెనాలి టికెట్ ఆశిస్తున్నారు. ఆ స్థానాన్ని జనసేనకు అప్పగిస్తే రాజా పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే తెలుగు తమ్ముళ్లు ఆలపాటికి టికెట్ ఇవ్వకుంటే సహించరు. పైగా ఆయన కూడా ఎప్పటి నుంచో పార్టీకి వీర విధేయుడిగా ఉంటూ వస్తున్నారు. మరి ఈ పరిస్థితిని టీడీపీ ఎలా అధిగమిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. 

Google News