జనసేనలో చేరిన పృధ్వీరాజ్, జానీ మాస్టర్.. నెక్ట్సేంటి?

జనసేనలో చేరిన పృధ్వీరాజ్, జానీ మాస్టర్.. నెక్ట్సేంటి?

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఏదైనా పార్టీల్లో చేరాలనుకునే వారికి ఇదే సరైన తరుణం. ఈ క్రమంలోనే పలువురు వివిధ పార్టీల్లో జాయిన్ అవుతున్నారు. సినీ సెలబ్రిటీలు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు. ఇప్పటికే కమెడియన్ పృధ్వీరాజ్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల సమయంలో ఆయన వైసీపీలో చేరారు. కొన్ని పరిస్థితుల కారణంగా ఆయన వైసీపీని వీడారు. తాజాగా ఆయన జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

జనసేనలో చేరిన పృధ్వీరాజ్, జానీ మాస్టర్.. నెక్ట్సేంటి?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా పృధ్వీరాజ్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పృధ్వీరాజ్‌ జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు నిన్న మరో సినీ సెలబ్రిటీ కూడా జనసేనలో చేరారు. ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ మంగళవారం జనసేన పార్టీలో చేరారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో జానీ మాస్టర్‌కు జనసేనాని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

జనసేనలో చేరిన పృధ్వీరాజ్, జానీ మాస్టర్.. నెక్ట్సేంటి?

కొన్నాళ్లుగా ప్రజా సమస్యలపై స్వయంగా క్షేత్రస్థాయిలో జానీ మాస్టర్ పోరాటం చేస్తున్నారు. దాదాపు పొలిటికల్ ఎంట్రీ కొన్నాళ్ల క్రితమే ఇచ్చారు. వైసీపీకి వ్యతిరేకంగా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ వస్తున్నారు. ఆ సమయంలోనే జానీ మాస్టర్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తారంటూ టాక్ నడిచింది. అది తాజాగా నిజమయ్యింది. జానీ మాస్టర్ జనసేన పార్టీలో చేరారు. ఇక ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే.. పృధ్వీరాజ్, జానీ మాస్టర్‌లు జనసేనలో అయితే చేరారు.. అయితే నెక్ట్సేంటి? వీరిద్దరికీ జనసేనాని ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా? లేదా? అసలే పార్టీకి అభ్యర్థుల కరవు అయితే ఉంది. ఈ తరుణంలోనే పలు పార్టీల నుంచి నేతలు సైతం జనసేనలో చేరుతున్నారు. మరి వారందరినీ కాదని వీరిద్దరికీ వైసీపీ టికెట్ ఇస్తుందా? ఒకవేళ టికెట్ ఇచ్చినా వారిద్దరికీ గెలిచేంత సత్తా ఉందా? అనేది తెలియాల్సి ఉంది. 

Google News