ఈ ఒక్క సీన్ తో.. టీడీపీ అంతిమ యాత్రకు సిద్ధమని తేలిపోయింది!

ఈ ఒక్క సీన్ తో.. టీడీపీ అంతిమ యాత్రకు సిద్ధమని తేలిపోయింది!

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని టీడీపీ అధినేత చంద్రబాబు విజన్ 2047‌ను ప్రకటించారు. అయితే ఈ మీటింగ్‌కు ప్రజలు కరువయ్యారు. కుర్చీలన్నీ ఖాళీగానే దర్శనమిచ్చాయి.

ఏదో అరకొరగా వచ్చిన వారు కూడా కాసేపటికే వెనుదిరగడం గమనార్హం. 40 సంవత్సారాలు అనుభవం అని చెప్పే చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదనడానికి ఇంతకు మించిన నిదర్శనం ఏం కావాలి?

ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలనే ధృడ సంకల్పంతో చంద్రబాబు ఉన్నారు. కానీ ఏదో మంత్రదండం చేపట్టి హాం ఫట్ అంటే అయిపోరుగా.. పైగా అక్కడ ఉన్నది జగన్ ప్రభుత్వం. ఆయన సంక్షేమానికి పెద్ద పీట వేసి జనం మనసుల్లో పాతుకు పోయారు. అలాంటి ఆయన్ను కాదని చంద్రబాబును జనం అక్కున చేర్చుకుంటారా? సమస్యే లేదు. అందుకే జనం ఆయన సభ అంటేనే రావడం లేదు. వచ్చినా పారిపోతున్నారు.

ఈ ఒక్క సీన్ తో.. టీడీపీ అంతిమ యాత్రకు సిద్ధమని తేలిపోయింది!

ఇక విజన్ 2047లో చంద్రబాబు కొత్తగా చెప్పిందేమీ లేదు. ఏ ప్రభుత్వమొచ్చినా సర్వసాధారణంగా ఈ అంశాలపై దృష్టి సారిస్తుంది. తానేదో ప్రపంచానికి తెలియని ఓ అద్భుత విషయాన్ని చెబుతున్నట్టు.. దానికో సభ.. జన సమీకరణ.. పెద్ద ఎత్తున ఖర్చు అవసరమా? అని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు.

అసలు కనీసం సొంత నియోజకవర్గమైన కుప్పానికి ఇప్పటి వరకూ మునిసిపాలిటీ హోదా తీసుకురాకపోయారు కానీ దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకురావడమంటే నమ్మేదెలా అని జనం ప్రశ్నిస్తున్నారు.