మళ్లీ నోరు జారిన చంద్రబాబు.. ఇంజనీర్ కావాలంటే బైపీసి అట..!

మళ్లీ నోరు జారిన చంద్రబాబు.. ఇంజనీర్ కావాలంటే బైపీసి అట..!

టీడీపీ అధినేత చంద్రబాబుకు అన్నీ నాకే తెలుసు.. అన్ని నేనే చేశా అనడం కొత్తేమీ కాదు. ప్రపంచంలో ఎక్కడ ఏ మంచి జరిగినా అది తన కారణంగానే అని చెప్పుకుంటుంటారు. కానీ ఎప్పటికప్పుడు బ్లేమ్ అవుతూనే ఉంటారు.

ఆయన వ్యాఖ్యలను సరి చేయలేక నేతలు నానా పాట్లు పడుతుంటారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావడమే థ్యేయంగా ఆయన పావులు కదుపుతున్నారు.

ఈ క్రమంలోనే వరుసబెట్టి ఏవేవో కార్యక్రమాలు చేపడుతున్నారు. యాత్రలు నిర్వహిస్తున్నారు. ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే విజన్ 2047‌ లో భాగంగా నిర్వహించిన చిట్ చాట్ కార్యక్రమం ఒకటి ఆయనకు దెబ్బేసింది.

మళ్లీ నోరు జారిన చంద్రబాబు.. ఇంజనీర్ కావాలంటే బైపీసి అట..!

ఇంజినీర్ అవ్వాలంటే బైపీసీ చదవాలని.. తన తెలివి తక్కువతనాన్ని చంద్రబాబు ప్రదర్శించారు. విజన్ ఉన్న నేతను.. తనకంటే గొప్ప వ్యక్తి లేడు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించగల సత్తా ఉన్న వ్యక్తిని తానని చెప్పుకునే చంద్రబాబు ఇలా ఎలా తప్పులో కాలేశారు?

ఇంజినీర్ అవ్వాలంటే బైపీసీ చదవాలా? ఇంకా నయం.. ఇంజిన్‌లో నీళ్లు పోయాలనలేదు.. సంతోషం. ఇప్పుడు చంద్రబాబు వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో తెగ వైరల్ అవుతోంది.

దీనిని చూసిన వారంతా నోరెళ్ల బెడుతున్నారు. చంద్రబాబు ఇలా ఎలా మాట్లాడారంటూ ఆసక్తికర చర్చకు తెరదీస్తున్నారు. ఫ్లోలో అన్నారో లేదంటే మరొకటో కానీ చంద్రబాబుపై మీమ్స్, ట్రోల్స్ మాత్రం వెల్లువెత్తుతున్నాయి.

ఇవీ చదవండి:

ఈ ఒక్క సీన్ తో.. టీడీపీ అంతిమ యాత్రకు సిద్ధమని తేలిపోయింది!

చిరంజీవి కామెంట్ల దుమారం: విరుచుకుపడుతున్న వైసీపీ నేతలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వస్తుందంటే..!

గద్దర్ ప్రాణం పోయే వరకూ.. చివరకు ఆసుపత్రిలో సైతం పాటలు వినిపిస్తూనే..!

Google News