తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వస్తుందంటే..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వస్తుందంటే..!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఈ నెలాఖరులో ఉంటాయని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ సైతం కన్ఫర్మ్ చేసింది.

అయితే ఇప్పుడు ముందున్న ప్రశ్నలు వచ్చేసి షెడ్యూల్ ఎప్పుడు? నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుంది? నిజానికి అసెంబ్లీ తొలిసారి సమావేశమైన తేదీయే ప్రామాణికం. ఈ లెక్కన చూసుకుంటే మాత్రం వచ్చే ఏడాది జనవరి 16 నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తవ్వాలి. అంటే మరో రెండు మూడు నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ రావడం ఖాయంగా కనిపిస్తోంది.

అసెంబ్లీ గడువు పూర్తవడానికి కనీసం 60 రోజుల ముందు ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేస్తుంది. ఈ లెక్కన చూస్తే నవంబర్‌ మొదటి వారంలో తెలంగాణ షెడ్యూల్ రావాల్సి ఉంది.

2018లో 2018లో మిజోరం, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టాలతో కలిపి తెలంగాణకు ఎన్నికలు నిర్వహించారు. ఇక ఇప్పుడు కూడా ఎన్నికలు ఇలాగే జరుగుతాయని ఊహాగానాలు వినవస్తున్నాయి. గతంలో ఒకేసారి ఎన్నికలు జరిగిన మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే మిజోరం అసెంబ్లీ సమావేశం నిర్వహించింది.

కాబట్టి ఈసీ మిజోరం అసెంబ్లీ సమావేశాన్ని ప్రామాణికంగా తీసుకుంటే ఆగస్ట్‌లోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుంది. అది కాకుండా తెలంగాణ తొలి అసెంబ్లీ సమావేశాన్ని ప్రామాణికంగా తీసుకుంటే నవంబర్ వరకూ వెయిట్ చేయాల్సిందే.

మొత్తానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.