విద్య అందించడంలో అగ్రపథాన ఆంధ్ర.. సీఎం జగన్ మరో ఘనత..

విద్య అందించడంలో అగ్రపథాన ఆంధ్ర.. సీఎం జగన్ మరో ఘనత..

విద్యకు కేరాఫ్ ఏదైనా ఉంది అంటే అది నిస్సందేహంగా ఆంధ్రానే. ఏపీ సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంస్కరణలు ఫలితాలు దేశ విదేశాల్లో మారుమోగుతున్నాయి. ఇటీవలే విదేశాల్లో జరిగిన పలు సదస్సుల్లో ఏపీ విద్యార్థులు పాల్గొని ఏపీ ప్రతిభను చాటి చెప్పారు. తాజాగా ప్రధాని ఎకనమిక్‌ అడ్వయిజరీ కౌన్సిల్‌ విడుదల చేసిన ‘స్టేట్‌ ఆఫ్‌ ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ ఇన్‌ ఇండియా’ నివేదిక సైతం విద్యారంగం అభివృద్ధికి సీఎం వైఎస్‌ జగన్‌ అమలు చేస్తున్న సంస్కరణలపై ప్రశంసల జల్లు కురిసేలా చేసింది. తాజాగా కౌన్సిల్‌ చైర్మన్‌ డాక్టర్‌ బిబేక్‌ దేబ్రాయ్‌ ‘స్టేట్‌ ఆఫ్‌ ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ ఇన్‌ ఇండియా’ నివేదికలు విడుదల చేశారు.

ఏపీ తర్వాతే కేరళ..

Advertisement

ఫౌండేషన్‌ ‘విద్య అందుబాటు’ అనే అంశంలో 38.50 స్కోరుతో దేశంలోనే అగ్రస్థానంలో ఏపీ ఉండటం విశేషం. ఆసక్తికర విషయం ఏంటంటే.. అక్షరాస్యతలో టాప్‌లో ఉన్న కేరళను సైతం ఏపీ బీట్ చేసింది. విద్య అందుబాటు అనే విషయంలో కేరళ 36.55 స్కోరును సాధించింది. అంటే ఏపీ కంటే రెండు పాయింట్స్ తక్కువ. చిన్న రాష్ట్రాల్లో కేరళ అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్నప్పటికీ ‘విద్య అందుబాటు’ అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇతర రాష్ట్రాలు నేర్చుకోవచ్చు’ అని పేర్కొంది. ఇది ఒక్కటేనా? కేంద్రం మరో ఐదు అంశాలను నిర్దేశించింది. వాటిలో జాతీయ సగటు స్కోరు 28.05గా ఉంటే సగానికి పైగా రాష్ట్రాలు అంతకన్నా చాలా వెనుకబడి ఉన్నాయని నివేదిక పేర్కొంది. ‘విద్య అందుబాటు’లో రాజస్థాన్‌ 25.67, గుజరాత్‌ 22.28, బీహార్‌ 18.23 స్కోరు మాత్రమే సాధించాయి.

విద్య అందించడంలో అగ్రపథాన ఆంధ్ర.. సీఎం జగన్ మరో ఘనత..

వేటి ఆధారంగా నివేదికను తయారు చేశారంటే..

పిల్లల పూర్వ ప్రాథమిక విద్య, పునాది స్థాయి అక్షరాస్యత అంశాల ఆధారంగా ఈ నివేదికను తయారు చేయడం జరిగింది. పూర్వ ప్రాథమిక, ప్రాథమిక స్థాయిలో అక్షర, సంఖ్యా జ్ఞానాలకు సంబంధించి చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలెలా ఉన్నాయో ఈ నివేదిక గమనంలోకి తీసుకుంది. అలాగే రాష్ట్రాలను కూడా మూడు భాగాలుగా విభజించింది. చిన్న రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా అంశాల వారీ స్కోరును పొందుపరిచింది. ఫౌండేషన్‌ విద్య పటిష్టంగా లేకుంటే పై తరగతుల్లో అభ్యసన సామర్థ్యాలు దెబ్బతినే ప్రమాదముంది కాబట్టి ఈ నివేదికలో వాటిని వివరిస్తూనే ఇతర సూచనలు అందించింది. మొత్తానికి ఏపీ సీఎం జగన్ విద్యారంగంలో అద్భుతమైన సంస్కరణలు తీసుకొచ్చి దేశవిదేశాల్లో ప్రశంసలు అందుకుంటూనే అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు.