టీడీపీ, జనసేనల మధ్య సీట్ల పంపకాలు ఫిక్స్..!

టీడీపీ, జనసేనల మధ్య సీట్ల పంపకాలు ఫిక్స్..!

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎవరి ఎత్తులు వారు వేస్తున్నారు. ముందుగా వైసీపీ వచ్చేసి టికెట్ విషయంలో కసరత్తు చేస్తుంటే.. టీడీపీ -జనసేనలు సీట్ల కసరత్తుపై ఫోకస్ చేస్తున్నాయి. ఎన్నికల పొత్తుల్లో భాగంగా ఎవరికెన్ని సీట్లు అనే విషయంపై చర్చలు నిర్వహిస్తున్నాయి. సమీకరణాలు..నేతల బలాబాలు అధారంగా సీట్ల  పంపిణీపై కసరత్తు చేసినట్టుగా తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీ, జనసేనల మధ్య సీట్ల పంపకం విషయంలో స్పష్టత వచ్చిందని టాక్. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయాలే విషయంలో కూడా స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. జనసేనకు టీడీపీ మంచి ఫిగర్‌నే ఇచ్చినట్టు సమాచారం. దీనిలో భాగంగా జససేనకు 35 అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీ స్థానాలు ఇచ్చినట్టు సమాచారం. ఇక అలాగే పవన్ పోటీ చేయబోయే స్థానంపై కూడా స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది.

ఇప్పటి వరకూ పవన్ కాకినాడ నుంచి పోటీ చేస్తారని ప్రచారం నడిచింది. పవన్ మూడు రోజుల పాటు కాకినాడలోనే మకాం వేయడం.. ఇంటర్నల్ మీటింగ్స్ కోసం మరో మూడు రోజులు కేటాయించడం వంటివి ఈ ప్రచారానికి బలం చేకూర్చింది. కానీ పవన్ అక్కడి నుంచి పోటీ చేయడం లేదట. ఆయన పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్టు టాక్ నడుస్తోంది. మొత్తానికి తూర్పు గోదావరిలో రాజకీయం ఇక ముందు మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. 

Google News