ఆలస్యం కానున్న ఎన్నికల షెడ్యూల్.. అధికార పార్టీకి ఇబ్బందేనా?
ఏపీలో ఎన్నికలపై కొత్త ప్రచారం జరుగుతోంది. ఈసారి ఏపీలో ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని సదరు ప్రచారం సారాంశం. ఏప్రిల్ తొలి వారంలో జరుగుతాయనుకుంటున్న ఎన్నికలు చివరి నాటికి జరగవచ్చని అంటున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. దేశంలో లోక్‌సభ ఎన్నిలకలకు సైతం సమయం ఆసన్నమైంది. ఈ తరుణంలోనే కొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు సైతం జరగాల్సి ఉంది. ఆ రాష్ట్రాల్లో ఏపీతో పాటు ఒడిషా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, జమ్మూకశ్మీర్ ఉన్నాయి.
అయితే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిన రాష్ట్రాలతోపాటే జమ్మూ కశ్మీర్‌కి కూడా ఎన్నికలు నిర్వహించాలంటే షెడ్యూల్ కొంత ఆలస్యమవుతుందని తెలుస్తోంది. అలా కాదంటే అనుకున్న సమయానికే జరగవచ్చు. దాదాపు మార్చి 9 నుంచి 12 మధ్య ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావచ్చని టాక్. అదే జరిగితే ఏప్రిల్ చివరి నాటికి కౌంటింగ్ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించిన షెడ్యూల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది కాదంటే షెడ్యూల్ ఆలస్యం కావొచ్చు.
ఇక షెడ్యూల్ ఆలస్యమవుతున్నా కొద్దీ అధికార పార్టీకి కొంత ఇబ్బంది తలెత్తే అవకాశమైతే ఉంది. ఇప్పటికి అయితే టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలూ కలిసొచ్చినా కూడా డీకొట్టగలిగే సత్తా అయితే వైసీపీకి ఉంది. గెలుపు అవకాశాలు పూర్తిగా అధికారపార్టీకే ఉణ్నాయి. అయితే ఎన్నికలు ఆలస్యమైతే మాత్రం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మంచి సమయం దొరుకుతుంది. వాళ్లు జనాల్లోకి ఆరామ్‌గా వెళ్లగలుగుతారు. అదే జరిగితే పరిస్థితులు కొంత మారే అవకాశం ఉంది. ఎంత త్వరగా ఎన్నికలు జరిగితే అంత అధికార పార్టీకి మేలు కలుగుతుంది.